Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో.. ప్యారిస్‌లో వీధుల్లో..

By:  Tupaki Desk   |   10 July 2015 4:34 PM GMT
పొట్టి గౌనులో.. ప్యారిస్‌లో వీధుల్లో..
X
తెలుగువాళ్లు బోర్‌ కొట్టారు. తంబీలు డబుల్‌ బోర్‌. బాలీవుడ్‌ వాళ్లు చేదయిపోయారు. వాళ్లకు పట్టించుకునేంత తీరిక లేదు. అందుకే ఇక్కడ ఉంటే లాభం లేదనుకుందో ఏమో.. ఏకంగా ఫ్రాన్స్‌ వెళ్లిపోయింది తాప్సీ. అక్కడ స్థానికులతో కలిసిపోయి.. ఊరంతా శికార్లు చేస్తోంది. వీధుల్లో సెగలు రేపుతోంది. అక్కడ కల్చర్‌ని పరిశీలిస్తూ వారితో సహజీవనం చేస్తూ కాలం వెల్లదీస్తోంది. డీటెయిల్స్‌లోకి వెళితే..

ఇటీవలి కాలంలో గంగ సినిమాతో పెద్ద హిట్‌ కొట్టిన తాప్సీ కాసింత లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తిరిగి కెరీర్‌ని చక్కదిద్దుకునే పనిలో పడింది. ఓ వైపు స్నేహితులతో కలిసి సరికొత్త వ్యాపార మార్గాల్ని అన్వేషిస్తూ, మరోవైపు వీలున్న ప్రతిసారీ ప్రయాణాలకు రెడీ అవుతోంది.ఈమధ్యనే ఎంతో ఘనంగా సాగిన తానా తెలుగు సంబరాల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ వేదికలపై తళుక్కుమని కలరింగ్‌ పెంచింది. అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత అట్నుంచి తిరిగి ఇండియా రాకుండా ప్యారిస్‌, ఫ్రాన్స్‌ అంటూ విదేశాలు వెళ్లిపోయింది. అయితే ఇలా యూరప్‌ దేశాల్లో శికారు చేయడం ఊరికే కాదు. షూటింగ్‌ పనిమీద వెళ్లి గ్యాప్‌లో ఎంజాయ్‌ చేస్తోందన్నమాట. కాకపోతే మరీ చిట్టి పొట్టి గౌనుల్లో నచ్చినట్టు తిరిగేస్తే లోకల్‌ కుర్రాళ్లను కంట్రోల్‌ చేయడం కాస్త కష్టమే అంటున్నారు.