Begin typing your search above and press return to search.
ఔట్ సైడర్స్ కోసం వర్క్ స్టేషన్ స్థాపించిన తాప్సీ
By: Tupaki Desk | 6 Aug 2022 5:17 AM GMTగట్సీ కంటెంట్ తో బాలీవుడ్ లోకి దూసుకెళ్లిన మోడ్రన్ గాళ్ గా తాప్సీకి ప్రత్యేకించి ఇమేజ్ ఉంది. గ్లామరస్ పాత్రలతో స్టార్ హీరోయిన్లు అయిన వారికి భిన్నంగా కంటెంట్ బేస్డ్ సినిమాలతో నటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. సౌతిండస్ట్రీస్ లో గ్లామరస్ పాత్రలతో విసిగిపోయిన అనుభవంతో తాప్సీ ముంబై పరిశ్రమలో అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడింది. తెలివైన ఎంపికలతో తనకంటూ ఒక బ్రాండ్ ఉందని ముద్ర వేసింది.
నామ్ షబానా- రష్మా రాకెట్- బద్లా లాంటి చిత్రాలతో నటిగా తనలోని యూనిక్ నెస్ ని చాటుకుంది. ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటేందుకు బిగ్ ప్లాన్స్ తో ముందుకు సాగుతోంది. గత కొంతకాలంగా తాప్సీ పన్ను సొంత నిర్మాణ సంస్థ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సమంత లాంటి అగ్ర కథానాయికతో హిందీలో వరుస చిత్రాలు నిర్మించేందుకు తాప్సీ సన్నాహకాల్లో ఉందని కూడా కథనాలొచ్చాయి. ఇంతలోనే తాప్సీ నుంచి అద్భుతమైన ప్రకటన ఒకటి వచ్చింది.
'ఔట్ సైడర్స్ ఫిల్మ్స్' పేరుతో ఒక సంస్థను స్థాపించిన తాప్సీ పన్ను ఈ సంస్థలో ఇండస్ట్రీ వెలుపలి నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని చెబుతోంది. ఇక్కడికి అడుగుపెడితే నా మనసుకు హృదయానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.. # ప్రాంజా ఇంక్స్ మైండ్.. #WorkStation #ForeverOutsider #ProudOutsider #OutsiderFilms అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించింది. ఇకపై ఈ సంస్థలో ఔట్ సైడర్స్ కి తాప్సీ పెద్ద అండగా నిలవనుంది. ఈ ప్రాసెస్ కి ప్రంజల్ అనే సీనియర్ నిర్మాత తాప్సీకి అండగా నిలువనున్నారు.
నిజానికి బాలీవుడ్ మాఫియా ఔట్ సైడర్స్ ని ఎదుగనివ్వకుండా ఆపేస్తోందన్న ప్రచారం ఉంది. ఇక ఇన్ సైడర్ గా పేరున్న అనురాగ్ బసు వంటి ప్రముఖ దర్శకుడితో ఎంతో సన్నిహితంగా మెలిగే తాప్సీ ఇలా ఔట్ సైడర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు ఒక ఆర్గనైజేషన్ ని ఫిట్ చేయడం ఆశ్చర్యపరిచేదే. ఔట్ సైడర్స్ టైటిల్ చాలా కనెక్టింగ్ గా ఉంది. బహుశా ముంబైకి వెళ్లే ప్రతి ఔట్ సైడర్ ప్రతిభావంతుడు తాప్సీ పిలుపు మేరకు ఈ గడపను తొక్కాల్సిందేనన్నమాట!! టాలీవుడ్ నుంచి వెళ్లేవాళ్లంతా ఔట్ సైడర్స్ గానే పరిగణించాలి. కాబట్టి ఇక ముంబైలో తెలుగు కళాకారులతో తాప్సీ ఆఫీస్ ఒక హబ్ గా మారుతుందన్నమాట!
బోల్డ్ ఎటెంప్ట్ కోసం కసరత్తు!ఈ కొత్త వెంచర్ కోసం తాప్సీ పన్ను చాలా కసరత్తు చేసినట్టే కనిపిస్తోంది. దాదాపు 20 సంవత్సరాలుగా కంటెంట్ సృష్టికర్త .. నిర్మాత అయిన ప్రాంజల్ ఖండియాతో తొలిగా చేతులు కలిపింది. అతను సూపర్ 30 ... 83.. సూర్మ... పికు.. ముబారకన్.. అజర్ వంటి ప్రఖ్యాత చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్న అనుభవజ్ఞుడు. తాప్సీ పన్ను నటించిన రష్మీ రాకెట్ ను కూడా నిర్మిస్తున్నాడు.
ప్రొడక్షన్ హౌస్ ప్రారంభంతో ఉప్పొంగిన తాప్సీ పన్ను మాట్లాడుతూ.. "ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం.. నా ప్రొడక్షన్ హౌస్ తో సినిమాపై నా ప్రేమను చూపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ తో నేను పరిశ్రమకు తిరిగి ఇవ్వడం కోసం ఇది. పురోగతి కోసం చూస్తున్న నాలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రాంజల్ - నేను కలిసి కెమెరా ముందు ..కెమెరా వెనుక కొత్త తారలు తాజా ప్రతిభావంతుల కోసం తలుపులు తెరవడానికి ఎదురుచూస్తున్నాం... అని తెలిపారు.
వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని అలాగే 7 ఏసెస్ పూణే అనే బ్యాడ్మింటన్ టీమ్ ను కూడా నడిపిస్తున్న తాప్సీ పన్నూ తన వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అవసరమైన నిర్వహణా సామర్థ్యం తనకు సహజంగా లభించిందని తెలిపింది. నేను ఎప్పుడో నా స్వంత ప్రొడక్షన్ హౌస్ ని సెట్ చేసుకోవాలని అనుకున్నాను. 11 ఏళ్ల నా కెరీర్ లో ప్రేక్షకులు పరిశ్రమ వ్యక్తులు నాకు చాలా సపోర్టును ప్రేమను అందించారు" అని చెప్పింది.
కంపెనీ టైటిల్ గురించి తాప్సీ మాట్లాడుతూ-''ప్రాంజల్ .. నేను ఇద్దరం సామాన్య నేపథ్యం నుండి వచ్చాము. అందుకే ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే పేరు మాకు క్లిక్ అయ్యింది. మేము అర్థవంతమైన వినోదాత్మకమైన మరియు నాణ్యమైన కంటెంట్ ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము..'' అని తెలిపారు. ఈ బ్యానర్ లో మొదటి ప్రాజెక్ట్ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం తాప్సీ తదుపరి లూప్ లాపేట- రష్మీ రాకెట్- దూబారా వంటి చిత్రాల్లో నటిస్తోంది. పలు సౌత్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.