Begin typing your search above and press return to search.
మిథాలీ బయోపిక్.. తాప్సీ జాక్ పాట్!?
By: Tupaki Desk | 3 July 2019 6:22 AM GMTస్పోర్ట్స్ బయోపిక్ ల స్పీడ్ గురించి తెలిసిందే. ఎం.ఎస్.ధోని- సచిన్ - మిల్కా సింగ్- మేరీకోమ్ లపై బయోపిక్ లు సంచలన విజయాలు సాధించాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్ స్టార్స్ పుల్లెల గోపిచంద్ .. సైనా నెహ్వాల్ లపై బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. కపిల్ దేవ్ బయోపిక్ గా 1983 వరల్డ్ కప్ విక్టరీని 83 పేరుతో తెరపై చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే లేడీ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
మిథాలీ బయోపిక్ గురించి 2017 నుంచి అభిమానులు ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నా .. ఫలానా స్టార్ తో సినిమా తీస్తున్నామని క్లారిటీగా ప్రకటించలేదు. ఎట్టకేలకు మిథాలీ బయోపిక్ ని తెరకెక్కించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. టైటిల్ పాత్రలో నటించేందుకు అందాల తాప్సీ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపింది. ``ఈ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడితే చాలా తొందరపాటు అనిపించుకుంటుంది. ఇంకా స్క్రిప్టు రెడీ కావాల్సి ఉంది. నిర్మాణ సంస్థనే నా గురించి అధికారికంగా చెబితే బావుంటుంది. ఆ అవకాశం నాకే వస్తే సంతోషమే!`` అని తాప్సీ వ్యాఖ్యానించడంతో ఈ బయోపిక్ లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ వచ్చింది. ఇంకా స్క్రిప్టు దశలోనే ఉన్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అన్నది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పింక్- నామ్ షబానా- బద్లా- మన్మార్జియాన్- గేమ్ ఓవర్ .. ఇలా వరుసగా ఆఫ్ బీట్ చిత్రాలకే ప్రాధాన్యతనిస్తూ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిపోతోంది తాప్సీ. ప్రస్తుతం తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బద్లా చిత్రంలో హాకీ ప్లేయర్ గా నటించినప్పుడే తాప్సీ ని క్రికెటర్ గా చూపించాలన్న ఆలోచన మేకర్స్ కి వచ్చిందట. అందుకే తననే సంప్రదించారు. ఒక క్రీడా బయోపిక్ లో నటించాలన్న ఆసక్తి నాకు ఉందని ఈ సందర్భంగా తాప్సీ వెల్లడించింది.
వన్డే ఫార్మాట్ లో 6000 పరుగులు చేసిన ఏకైక స్టార్ క్రికెట్ ప్లేయర్ గా మిథాలీరాజ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ గా ఎన్నోసార్లు జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించిన మిథాలీ కెరీర్ ఇప్పటికే 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మిథాలీ బయోపిక్ గురించి చర్చ సాగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో పాటు భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ రూపొందిస్తున్న `సాండ్ కి ఆంఖ్` చిత్రంలోనూ తాప్సీ నటించనుంది. క్లాసిక్ కాలంలో గ్రేట్ షార్ప్ షూటర్ గా పాపులరైన చంద్రో తోమర్ జీవితంపై ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సినిమా ఇదని తెలుస్తోంది.