Begin typing your search above and press return to search.
ఆ ప్రశ్నలు పూర్తిగా తప్పు కావులే తాప్సీ
By: Tupaki Desk | 7 March 2018 6:45 AM GMTఓ సక్సెస్ ను తలకెక్కించుకుంటే ఏ రేంజ్ లో రెచ్చితారో.. బహుశా తాప్సీ పన్ను రోల్ మోడల్ అయిపోయేట్లుగా ఉంది. కాసింత ఫేమస్ అయిన తర్వాత.. ఎవరినైనా గతంలో ఎదుర్కున్న కష్టాలు ఏమున్నాయి అని అడగడం సహజంగానే జరుగుతుంది. వాళ్లు కూడా చాలా డిప్లొమాటిక్ గా.. ఎంతో శ్రమ చేసి పైకొచ్చామని చెబుతూ ఉంటారు. అంతే తప్ప.. ఆ కష్టాలు ఏవనే విషయాన్ని మాత్రం పైకి చెప్పరు.
అంతెందుకు సన్నీ లియోన్ ను తీసుకుంటే.. తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం.. అప్పుడు చేసిన పోర్న్ సినిమాలే అని గర్వంగా చెబుతుంది. అలా పోల్చకపోయినా.. అప్పటి పరిస్థితులను ఇప్పుడు తాప్సీ వర్ణించి చెబుతున్న తీరు మరీ దారుణంగా ఉంది. తొలి సినిమా ఝుమ్మంది నాదం విషయంలో.. రాఘవేంద్రరావును తక్కువ చేసి మాట్లాడి గతంలో తిట్లు తిన్న ఈ భామ.. ఇప్పుడు పేర్లు చెప్పకుండా.. అప్పుడు తాను ఎదుర్కున్న కొన్ని ప్రశ్నలను గురించి చెప్పుకొస్తోంది.
"నువ్వు అంత అందంగా.. గ్లామరస్ గా లేవు.."
"ఓహ్.. నువ్వు మరీ సీరియస్ యాక్టర్ లా ఉన్నావు"
"నువ్వు అంత మంచి నటివి కావు"
"నువ్వు ఎవరి వారసురాలివి కావు"
"నీకు మార్కెట్ చేసుకునేంతటి పేరు గుర్తింపు లేవు"
ఇలాంటి మాటలను వినాల్సి వచ్చిందని.. ఇవాళ తాపీగా బాధపడిపోతోంది తాప్సీ. ఇంతకీ ఇప్పుడు గుర్తింపు వచ్చింది అంటే.. అవన్నీ ఎదుర్కొని అధిగమించడం కారణంగానే అనే సంగతి మరచిపోయినట్లుగా ఉంది ఈ భామ. ఇలాంటివన్నీ ఎవరైనా ఎదిరించక తప్పదు. మార్కెట్ లేకపోతే.. కోట్లు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ఆమాత్రం భయపడ్డం సహజమే. ఇదంతా చూస్తుంటే.. తాప్సీ ఆశించిన ప్రకారం బహుశా తను నటిస్తాను అనగానే.. రెడ్ కార్పెట్ వేసేసి సినిమాలు తీసేసి ఛాన్సులు ఇచ్చేయాలేమో!