Begin typing your search above and press return to search.

హాటీ 9 లోనే ప్రేమ‌క‌లాపం

By:  Tupaki Desk   |   11 Jan 2019 5:26 AM GMT
హాటీ 9 లోనే ప్రేమ‌క‌లాపం
X
టాలీవుడ్‌ లో అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది తాప్సీ. అక్క‌డ బేబి.. పింక్‌.. నామ్ ష‌బానా.. జుద్వా 2 వంటి చిత్రాల‌తో మంచి జోరుమీదున్న ఈ పంజాబీ చిన్న‌ది ఆశించిన స్థాయిలోనే కెరీర్ ని ర‌న్ చేస్తోంది. ఇటీవ‌లే మ‌న్మార్జియాన్ చిత్రంతో హిట్టు అందుకున్న ఈ భామ‌ - ఇప్ప‌టికే ప‌లు క్రేజీ సినిమాల‌కు సంత‌కాలు చేసింది.

తాప్సీ గ‌త కొంత‌కాలంగా ఓ విదేశీ బ్యాడ్మింట‌న్ ఆట‌గాడితో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త కొంత కాలంగా సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న తాప్సీ అప్పుడే అత‌నికి బ్రేక‌ప్ చెప్పేసింద‌న్న ప్ర‌చారం కూడా సాగింది. కానీ దేనికీ స‌రైన క్లారిటీ లేదు. అయితే త‌న ప్రేమ‌క‌థ‌ను కంచికి చేరింద‌ని తాప్సీ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌మైంది. అయితే బ్రేక‌ప్ చెప్పింది ఈ ప్రేమ క‌థ కాద‌ట‌. త‌న చిన్న నాటి ప్రేమ‌క‌థ.. టీనేజీ ల‌వ్ స్టోరి అని తెలిసింది.

చింతాకు క‌ళ్ల తాప్సీ 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న రోజుల్లోనే ప్రేమ‌లో ప‌డిందంట‌. అయితే ప‌దో త‌ర‌గ‌తి అంద‌రికీ చాలా ఇంపార్టెంట్. ప‌రీక్ష‌ల్లో పాస్ కావాలంటే టెన్ష‌న్లు త‌ప్ప‌దు. ఆ క్ర‌మంలోనే మొగ్గ‌లోనే ప్రేమ‌కు స‌ద‌రు ప్ర‌బుద్ధుడు తూచ్ కొట్టేశాడ‌ట‌. భ‌యంతో త‌న ల‌వ‌ర్ కం ప్ర‌బుద్ధుడే నో చెప్పేయ‌డం త‌న‌కు పెద్ద షాకిచ్చిందిట‌. అదే విష‌యాన్ని తాప్సీ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అభిమానుల‌కు షాకిచ్చింది. అప్ప‌ట్లో సెల్ ఫోన్ వ్య‌వ‌స్థ వుంటే త‌న ప్రేమ నిల‌బ‌డేద‌ని, అవి లేక‌పోవ‌డంతో ఓ ప‌బ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అత‌నికి ఫోన్ చేసి త‌న‌ని ఎందుకు వ‌దిలేస్తున్నావ‌ని నిల‌దీశాన‌ని పెద్ద బాంబు పేల్చింది. ఇక త‌ను పెళ్లాడ‌బోయే వ‌రుడి గురించి త‌న కోరిక‌ల చిట్టా విప్పిన తాప్సీ త‌న ఆలోచ‌న‌ల్లాగే త‌న‌కు కాబోయే వాడి ఆలోచ‌న‌లు వుండాల‌ని అలాంటి వాడు చిక్కితే వెంట‌నే పెళ్లాడేస్తాన‌ని చెప్పేసింది. ప్ర‌స్తుతం తాప్సీ క్రీడ‌ల‌కు - క్రీడాకారుల‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తూ ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. సిండ్రెల్లా పేరుతో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తోంది.