Begin typing your search above and press return to search.
గ్లామర్ కోసం ఆటాలాడుతోందంతే
By: Tupaki Desk | 18 Aug 2015 3:40 PM ISTఈకాలం హీరోయిన్స్... ఫిట్ నెస్ కోసం, స్లిమ్ లుక్ కోసం ఎంతగా కష్టపడతారో అందరికీ తెలుసు. అంతేసి సంపాదిస్తున్నా కనీసం నోటికి నచ్చింది తినే అదృష్టం కూడా ఉండదు పాపం. అంతే కాదు.. రోజూ గంటలపాటు జిమ్ లలో ఒళ్లొంచాల్సిందే. ఎక్సర్ సైజులు చేస్తూ... ఉన్న కాస్త కొవ్వునూ కరగదీయాల్సిందే. కానీ తాప్సీ మాత్రం వీటన్నిటికీ అతీతమంట. అసలు జిమ్, ఎక్సర్ సైజ్ ల పేరు చెబితేనే చిర్రుబార్రులాడుతోంది తాప్సీ పన్ను. ఈ భామకు అసలు నమ్మకం కూడాలేదంట ఫిట్ నెస్ సెంటర్ల పై. అయినా తాప్సీ మాంచి ఫిట్ గానే కనిపిస్తుంది.
దీనికి కారణమేంటో, తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసింది తాప్సీ. జిమ్ ల కంటే... స్పోర్ట్స్ పై బాగా కాన్సన్ ట్రేట్ చేస్తానని చెప్పింది తాప్సీ. ముఖ్యంగా స్క్వాష్ బాగా ఆడేస్తుందట కూడా. ఆ గేమ్ లో తనని బీట్ చేయగలవారు ఇఫ్పటివరకూ తారసపడలేదని కూడా అంటోంది. జిమ్ సెంటర్ల చుట్టూ తిరిగి శరీరంపై దృష్టి పెట్టేబదులు.. అదే ఆటలపై దృష్టి పెడితే.. బాడీ, మైండ్ రెండూ ఫిట్ గా ఉంటాయంటోంది తాప్సీ. సో తాప్సీ గ్లామర్ రహస్యం ఏంటో తెలిసిపోయింది కాబట్టి... ఇక జనాలు ఈ రూట్ లో కూడా ట్రై చేసేయచ్చు.