Begin typing your search above and press return to search.
తాప్సి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కానీ..
By: Tupaki Desk | 22 July 2017 9:30 AM GMTతొందరపడి నోరు జారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనుభవ పూర్వకంగా తెలిసొస్తోంది సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్నుకి. టాలీవుడ్ ఖాళీ చేసి వెళ్లిపోయాక అమ్మడు మన ఇండస్ట్రీ గురించి రకరకాల కామెంట్లు చేసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికి తాప్సి మళ్లీ టాలీవుడ్ వైపు చూసే పరిస్థితి కనిపించలేదు. అందులోనూ ఇంతకుముందు కొంచెం ఆచితూచే మాట్లాడింది తాప్సి. కానీ తెలుగులో చాలా గ్యాప్ తర్వాత తాను చేసిన ‘ఆనందో బ్రహ్మ’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో రాఘవేంద్రరావు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయిపోయిందీ భామ.
ముందు తన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నానని.. తన వ్యాఖ్యలకు రాఘవేంద్రరావుతో సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా నవ్వుకున్నారని చెప్పింది తాప్సి. కానీ వివాదం సద్దుమణగలేదు. తర్వాత తన ఉద్దేశం అది కాదంటూ.. సుదీర్ఘంగా వివరణ ఇస్తూ వీడియో మెసేజ్ ద్వారా క్షమాపణలు చెప్పింది తాప్సి. అయినా పరిస్థితి మారలేదు. మరోవైపు ‘ఆనందో బ్రహ్మ’ మేకర్స్ నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. నీ వల్ల సినిమానే దెబ్బ తినే పరిస్థితి వచ్చిందంటూ వాళ్లు ప్రెజర్ పెట్టడంతో ఇక లాభం లేదని తాజా మరో మార్గాన్ని ఎంచుకుంది.
టాలీవుడ్ సెలబ్రెటీల ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన ఓ వ్యక్తి ముందుకెళ్లి కూర్చుంది. దాదాపు గంట పాటు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో వేరే విషయాలు కూడా మాట్లాడింది కానీ.. ప్రధానంగా ఆమె ఫోకస్ రాఘవేంద్రరావుపై తన వ్యాఖ్యలకు సంబంధించిన వివాదంపై వివరణ ఇవ్వడం మీదే నిలిచింది. ఐతే సమస్య ఏంటంటే.. తాప్సి ఏమీ మాట్లాడకుండా బేషరతుగా సారీ చెప్పేస్తే వివాదం ఎప్పుడో సద్దుమణిగిపోవునేమో.. కానీ తన వ్యాఖ్యల్లో తప్పు లేదంటే.. తన ఉద్దేశం అది కాదంటూ.. ఆ ఉదాహరణలు.. ఈ ఉదాహరణలు చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుండటమే విడ్డూరం. అలా కవర్ చేసినంత కాలం ఈ వివాదానికి ముగింపు ఉండదని ఆమె ఎందుకు అర్థం చేసుకోవట్లేదో?