Begin typing your search above and press return to search.
తాప్సీ.. టాలీవుడ్ ను వదలవా?
By: Tupaki Desk | 5 April 2017 7:19 AM GMTతెలుగులో సినిమాలు చేసినంత కాలం.. ఇక్కడి సినిమాల గురించి ఆహా ఓహో అన్నట్లే మాట్లాడేది తాప్సి. కానీ బాలీవుడ్ వెళ్లిపోయాక మాత్రం అదే పనిగా టాలీవుడ్ ను టార్గెట్ చేసి మాట్లాడుతోంది. ఏదో బాలీవుడ్లో రెండు మూడు మంచి అవకాశాలు రావడం.. తన టాలెంట్ చూపించి మంచి పేరు సంపాదించడం ఆలస్యం.. తెలుగు వాళ్లు తన ప్రతిభను సరిగ్గా వాడుకోలేకపోయారంటూ పలుమార్లు అసంతృప్తి వ్యక్తి చేసింది తాప్సి. తాజాగా ఆమె టాలీవుడ్ వాళ్లు తన మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా టాలీవుడ్ నిర్మాతలపై కొత్త ఆరోపణలు చేసింది తాప్సి.
గతంలో తాను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాపైతే.. వాటికి తనను బాధ్యురాలిని చేసి పారితోషకాలు ఎగ్గొట్టారని.. తగ్గించారని వాపోయింది తాప్సి. తనపై ఐరెన్ లెగ్ ముద్ర వేసిన వాళ్లే ఇలా తనకు రెమ్యూనరేషన్ విషయంలో అన్యాయం చేశారని ఆమె ఆరోపించింది. పర్టికులర్ గా తెలుగు సినిమా అని చెప్పకపోయినప్పటికీ.. తాప్సికి ప్రధానంగా ఫ్లాపులు వచ్చింది తెలుగు సినిమాల్లోనే కాబట్టి ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే ఇక్కడున్నన్ని రోజులు తాప్సి చిలక పలుకులే పలికింది. మన సినిమాల్ని.. ఇక్కడి దర్శక నిర్మాతలు.. హీరోల్ని మోసేసింది. కానీ ఇక్కడ కెరీర్ ముగిసిపోయి బాలీవుడ్లో సెటిలైపోయాక మాత్రం పాత కథల్ని తవ్వుతూ టాలీవుడ్ మీద అదే పనిగా విమర్శలు గుప్పిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/