Begin typing your search above and press return to search.

బాలీవుడ్ పుణ్యమా అని సంపాదన ఘనం

By:  Tupaki Desk   |   1 Jun 2019 7:20 AM GMT
బాలీవుడ్ పుణ్యమా అని సంపాదన ఘనం
X
గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారి సంపాదన ఎల్లవేళలా ఒకేరకంగా ఉండదు. అప్ అండ్ డౌన్లు సహజం. ఒక్కోసారి డబ్బు వస్తే ఫుల్ గా వచ్చి ఎకౌంట్ లో పడిపోతుంది.. ఒక్కోసారి అదే డబ్బు మొహం చాటేస్తుంది. అందుకే తాప్సీ లాంటి తెలివైన హీరోయిన్లు తమ సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెడతారు. తాప్సీ తన కెరీర్ మొదట్లో పెద్దగా సంపాదించింది లేదు కానీ ఓ రెండేళ్ళ నుంచి బాలీవుడ్లో తనాకంటూ మార్కెట్ సంపాదించుకుంది. వరస విజయాలతో డబ్బు కూడా వెనకేస్తోంది.

తాప్సీ ఓ రెండేళ్ళ క్రితమే ముంబైలో ఒక 3-బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దానికి తన ప్రియమైన చెల్లి శగున్ చేత ఇంటీరియర్స్ చేయించుకుందట. పోయినేడాదే ఆ ఫ్లాట్ కు షిఫ్ట్ అయిందని సమాచారం. అంతే కాదు ఒక వ్యానిటీ వ్యాన్.. ఖరీదైన లగ్జరీ కారు కూడా కొనుక్కుందట. ఓస్ అంతే కదా అనుకోకండి. ఈమధ్య తను నివాసం ఉండే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో మరో ఫ్లాట్ బేరానికి వచ్చిందట. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట. ఈ కొత్త ఫ్లాట్ కు ఇంటీరియర్స్ చేసే బాధ్యతను తన చెల్లికే అప్పగించిందట. ఇంటీరియర్స్ కోసం తాప్సీ దగ్గర కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయట. కొంతకాలం క్రితం తాప్సీ స్పెయిన్ కు వెళ్ళినప్పుడు అక్కడ డెకరేషన్ లైట్స్ లాంటివి షాపింగ్ చేసుకొని ఇండియాకు తీసుకొచ్చిందట. ఇప్పుడు వాటిని తన కొత్త ఇంటికి వాడుతుందన్నమాట. ఈ లెక్కన బాలీవుడ్ లో తాప్సీ సంపాదన గట్టిగా ఉన్నట్టే. ఆ సంపాదనను తెలివిగా రియల్ ఎస్టేట్ పై ఇన్వెస్ట్ చేస్తోంది.

ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. మొత్తం ఐదు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. హిందీలో 'తడ్కా'.. 'మిషన్ మంగల్'.. 'సాంద్ కీ ఆంఖ్'.. తమిళంలో జయం రవి కొత్త సినిమా ఉన్నాయి. ఇవి కాకుండా త్వరలో 'గేమ్ ఓవర్' తెలుగు తమిళంలో ఒకేసారి రిలీజ్ కానుంది.