Begin typing your search above and press return to search.
స్టార్ పవర్ ని మహమ్మారీ తగ్గించేసిందన్న తాప్సీ
By: Tupaki Desk | 7 Dec 2020 2:30 AM GMTశత్రువుల్ని వెంటాడడంలో కంగన ఒక పద్ధతిని ఎంచుకుంటే తాప్సీ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటోంది. ఆ ఇద్దరూ పురుషాధిక్య ప్రపంచాన్ని వ్యతిరేకించేవారే. కంగన కొంత హార్డ్ హిట్టర్ అయితే తాప్సీ తెలివిగా పదజాలం ఉపయోగించడంలో నేర్పరి. అందుకే ఇటీవలి కాలంలో నాయికా ప్రధాన చిత్రాల్ని ఎంచుకుంటూ తమకంటూ ఓ కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఆ ఇద్దరూ .. ఎవరికి వారే!
పబ్లిక్ లో తాము ఏం చెప్పదలిచినా దానికి ఏమాత్రం భయపడక ముందుకొస్తున్నారు ఆ ఇద్దరూ. ఆసక్తికరంగా ఆ ఇద్దరికీ క్షణం కూడా పొసగదన్న సంగతి తెలిసిందే. ఈ భామలు ఒకరికొకరు బద్ధ శత్రువులు. వీలున్న ప్రతి వేదికపైనా ఒకరినొకరు తూలనాడుతూ కించపరుచుకుంటూ పలు సందర్భాల్లో మీడియాలో హైలైట్ అయ్యారు.
ప్రస్తుత క్రైసిస్ కాలంలో తాప్సీ జోరు తగ్గించినా కంగన మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శివసేనతో హోరాహోరీ సాగించారు. ఇక తాప్సీ మాత్రం పూర్తిగా ఓటీటీ కంటెంట్ డిజిటల్ పై రివ్యూలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారిన పరిస్థితుల్లో మహిళా ప్రాధాన్యత పెరుగుతోందని డిజిటల్ కంటెంట్ లో ఇది ప్రూవ్ అవుతోందని తాప్సీ అంటున్నారు. నాయికా ప్రధాన సినిమాలకు చక్కని ఆదరణ దక్కుతోందని అన్నారు. ఇంతకుముందుతో పోలిస్తే స్టార్ విలువ మారుతోందని వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ఇక తాప్సీతో పాటు పార్వతి తిరువోతు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మహమ్మారి వల్ల స్టార్ డమ్ అనేది పూర్తిగా దెబ్బతింది అన్నది వీరి అభిప్రాయం.
ప్రస్తుతం చిన్నా పెద్దా అనేది లేదు. ఈ పరిస్థితి మహిళా నటీమణులు సాంకేతిక నిపుణులకు పెద్ద అవకాశాలను ఇచ్చింది. మునుముందు సాధారణ స్థితి పునరుద్ధరించబడిన తర్వాత థియేటర్లలో విడుదలయ్యే ధోరణి కొనసాగుతుందని ప్రజలు సినిమాలు చూడటానికి థియేటర్లకు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.