Begin typing your search above and press return to search.

సౌందర్య పాత్రలో తాప్సీ!!

By:  Tupaki Desk   |   4 Nov 2016 7:30 PM GMT
సౌందర్య పాత్రలో తాప్సీ!!
X
హలో బ్రదర్.. 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సెన్సేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మూవీ ఇది. అక్కినేని నాగార్జున డ్యుయల్ రోల్ లో నటించగా.. రమ్యకృష్ణ-సౌందర్యలు హీరోయిన్లుగా చేసిన ఈమూవీని.. మరోసారి తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. నాగచైతన్యతో హలోబ్రదర్ లేటెస్ట్ వెర్షన్ తీయాలనే ఆలోచన చాలామందికే ఉంది కానీ.. ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

అయితే.. అప్పటి హలో బ్రదర్ ను హిందీలో జుడ్వా పేరుతో రీమేక్ చేశారు. అక్కడ భారీ హిట్ అయిన జుడ్వాకు డేవిడ్ ధావన్ దర్శకుడు. ఇప్పుడు తన కొడుకు వరుణ్ ధావన్ తో మరోసారి ఈ హలోబ్రదర్ రీమేక్ కు లేటెస్ట్ వెర్షన్ రెడీ చేస్తున్నాడు డేవిడ్ ధావన్. ఇప్పటికే జాక్వెలిన్ ని ఓ హీరోయిన్ గా పైనల్ చేయగా.. ఇప్పుడు రెండో హీరోయిన్ గా తాప్సీని ఫైనల్ చేశారు. పింక్ తర్వాత ఫుల్ ఫేమ్ సంపాదించేసిన తాప్సీ.. హలో బ్రదర్ లో సౌందర్య చేసే పాత్రకు ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకూ ఆర్టిస్టిక్ మూవీస్ లో కనిపించిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నుకి.. ఈ కమర్షియల్ ఎంటర్టెయినర్ తో మంచి బ్రేక్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/