Begin typing your search above and press return to search.
మిథాలీరాజ్ బయోపిక్ లో జాక్ పాట్
By: Tupaki Desk | 3 Dec 2019 10:48 AM GMTక్రీడా బయోపిక్ ల ట్రెండ్ గురించి తెలిసిందే. ఈ తరహా జీవితకథల్లో స్ఫూర్తిని రగిలించే ఏదో ఒక పాయింట్ యూత్ కి కనెక్టవుతోంది. దాంతో స్కూల్ కాలేజ్ పిల్లల్ని థియేటర్లకు రప్పించేందుకు ఆస్కారం ఉంది. అందుకే బాలీవుడ్ లో ఈ తరహా బయోపిక్ లు తెరకెక్కించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. గత కొంతకాలంగా లేడీ క్రికెటర్.. టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ గురించిన ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
తాప్సీ సహా పలువురు కథానాయికలు ఈ బయోపిక్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారమైంది. ఎట్టకేలకు తాప్సీనే టైటిల్ పాత్రకు కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ట్విట్టర్ మాధ్యమంలో ఈ సంగతిని ప్రకటించారు.
క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ నటిస్తున్నారు.. `శభాష్ మిథు` అనేది టైటిల్. రాయీస్ ఫేం రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వయాకామ్ 18 స్టూడియో సంస్థ నిర్మించనుంది అంటూ తరణ్ పూర్తి వివరాల్ని వెల్లడించారు. ఆసక్తికరంగా మిథాలీ రాజ్ ఇటీవలే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన `కౌశల్య కృష్ణమూర్తి` మూవీ ప్రీరిలీజ్ వేడుకకు విచ్చేసినప్పుడు క్రీడా బయోపిక్ ల గొప్పతనం గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఇంతలోనే అనూహ్యంగా తనపైనే బయోపిక్ ప్రకటన వెలువడింది.
లేడీ క్రికెట్ లో అత్యధిక పరుగులు .. అత్యధిక సెంచరీలు సాధించిన మిథాలీ టీమిండియా కెప్టెన్ గా ఎదిగేందుకు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించడమే కాదు.. మొక్కవోని ధీక్షకు పట్టుదలకు కేరాఫ్ అడ్రెస్ అని సన్నిహితులు చెబుతారు. అందుకే ఈ బయోపిక్ ని కానుకగా ఇవ్వబోతున్నారన్నమాట.