Begin typing your search above and press return to search.

తాప్సీ పంచ్ పవర్ పెరుగుతోంది

By:  Tupaki Desk   |   21 Dec 2015 7:30 AM GMT
తాప్సీ పంచ్ పవర్ పెరుగుతోంది
X
తాప్సీ పన్ను.. ఈ పేరు చెబితే కొన్ని నెలల క్రితం వరకూ కాసింత అమాయకమైన రొమాంటిక్ ఫేస్ గుర్తొచ్చేది కానీ.. లారెన్స్ గంగ తర్వాత భయం కూడా వేసేయడం మొదలైపోయింది. ఇప్పుడు భయానికి తోడు.. అమ్మడు రియల్ ఫైటింగ్స్ కూడా నేర్చేసుకుంటోంది. అక్షయ్ కుమార్ మూవీ బేబీ లో.. రౌడీగా నటించి మగాళ్లను మట్టి కరిపించిన తాప్సీ గుర్తుందా.? ఇది సినిమా సీన్స్ అయినా.. ఇందుకోసం తాప్సీ బోలెడు ట్రైనింగ్ తీసుకుంది.

మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన "క్రవ్ మాగా" నేర్చేసుకోవడం స్టార్ట్ చేసింది. సినిమా ఎప్పుడో అయిపోయినా ఈ ట్రైనింగ్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ చేస్తోంది తాప్సీ పన్ను. కారణం ఏంటంటే.. ఇదో స్వయం రక్షణ కోసం నేర్చుకునే ఆర్ట్. ఈ ఇజ్రాయిల్ మార్షల్ ఆర్ట్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లో క్రవ్ మగాకు సాటి వచ్చేది మరొకటి లేదని అంటారు. అందుకే దీనిపై బాగా దృష్టి పెట్టిందట తాప్సీ. ఏళ్ల తరబడి నేర్చేసుకుంటూ.. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అయిపోయిందట. సాధారణంగా ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండే తాప్సీకి.. చాలాసార్లు ఈవ్ టీజర్ల నుంచి వేధింపులు ఎదరవుతుంటాయి.

ఇలాంటి సమయంలో సింగిల్ హ్యాండెడ్ గా డీల్ చేసేయగలదట తాప్సీ. ప్రస్తుతం ఈమె జోలికి ఒకేసారి ఓ అరడజన్ మంది వచ్చినా.. తన పంచ్ పవర్ తో సమాధానం చెప్పేసే స్థైర్యం - ధైర్యం ఉన్నాయట తాప్సీకి. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే జాగ్రత్త.. తాప్సీ పన్ను పంచ్ పవర్ బాగా పెరిగిపోయింది.