Begin typing your search above and press return to search.

తాప్సి కోరికను చెబుతోన్న లుక్స్

By:  Tupaki Desk   |   29 Jan 2018 6:16 AM GMT
తాప్సి కోరికను చెబుతోన్న లుక్స్
X
నార్త్ బ్యూటీ తాప్సి అందం గురించి ఎంత పొగిడినా తక్కువే. మొదటి సినిమాతోనే ట్రెడిషినల్ లుక్ లో ఘాటైన అందాలని చూపించి ఒక్కసారిగా అందరిని ఆకర్షించింది. ఆమె అందం చూసి స్టార్ హీరోయిన్స్ కు ఇక కష్టకాలం మొదలైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే తాప్సి బ్యాడ్ లక్ ఏమిటో గాని తెలుగులో ఎన్ని సినిమాల్లో నటించిన ఒక్క సోలో బాక్స్ ఆఫీస్ హిట్ కూడా అందుకోలేదు. కొన్ని సినిమాలో నటించినప్పటికీ అంతంత మాత్రంగానే పేరొచ్చింది.

ఇక అమ్మడు తన అందాలు ఇక్కడ క్లిక్ అవ్వడం లేదని అనుకుందో ఏమో గాని బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వడంతో తొందరగా సెట్ అయ్యింది. జూడ్వా 2 సినిమాలో నార్త్ జనాలకు సొట్ట బుగ్గల సుందరి అందాలు తెగ నచ్చేశాయి. పైగా బికినీ వేయడంతో చాలా మంది సినీ దర్శకులకు ఈ హీరోయిన్ తో సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం తాప్సికి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. బయోపిక్స్ లలో కూడా కూడా తాప్సికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇకపోతే అమ్మడికి సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది.

అయితే సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో నటించిన తాప్సికి హాలీవుడ్ లో కూడా అవకాశం వస్తే బావుండు అనే విధంగా కొన్ని ఫొటోలతో చెప్పేసింది. హాలీవుడ్ క్లాసిక్ బ్యూటీలు ఉన్నట్లుగా రెడీ అయ్యి కొన్ని ఫొటోలకు స్టైలిష్ గా స్టిల్ ఇచ్చింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ ని చాలా ఆకర్షిస్తున్నాయి. ఓ క్యాలెండర్ లుక్ కోసం తాప్సి ఆ ఫొటో షూట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో అలాగే తలపై రోజా లతో అమ్మడు వివిధ భంగిమలతో కాస్ట్యూమ్స్ తో కనిపించింది.