Begin typing your search above and press return to search.
వాళ్ల మాదిరిగా కెమెరా ముందు వెనుక నటించడం నాకు తెలియదు
By: Tupaki Desk | 16 Dec 2022 5:30 PM GMTముద్దుగుమ్మ తాప్సి తన తోటి హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంత మంది మాదిరిగా తనకు కెమెరా ముందు నటించి.. కెమెరా వెనుక కూడా నటించడం రాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నిజాయితీగా ఉంటానని మీడియా ముందు కానీ ఎక్కడైనా కానీ ఒకే మాదిరిగా మాట్లాడతానని తాప్సి పేర్కొంది.
ఇటీవల విలేకరుల సమావేశంలో నేను విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చాలా మంది నాపై విమర్శలు చేస్తున్నారు. నన్ను పొగరుబోతు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజంగా మాట్లాడుకోవాలంటే విలేకరుల వల్లే నేను ఎంతో బాధ పడ్డాను. వారి వల్ల పదే పదే నా యొక్క ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అయినప్పటికీ వారితో సానుకూలంగా మాట్లాడటం నాకు చేతకాదు. నా మనసులో ఉన్నది విలేకరుల ముందు పెట్టాను.
సమాజంలో మంచి మార్కులు కొట్టడానికి కొంత మంది హీరోయిన్స్ కెమెరా ముందు మాత్రమే కాకుండా కెమెరా వెనుక.. మీడియా ముందు కూడా నటిస్తూ ఉంటారు. అలా నేను కాదు.
నటిగా నా వర్క్ ని జనాలు మెచ్చుకుంటే చాలు. నన్ను కూడా మెచ్చుకోవాలని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఎలా ఉంటానో అలాగే మీడియా ముందు ఉంటాను...జనాల ముందు ఉంటాను అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.
తాజాగా దోబారా ప్రమోషన్ లో భాగంగా మీ సినిమా లను బాయికాట్ చేయమని నెటిజన్స్ అంటున్నారు అంటూ విలేకరులు ప్రశ్నించగా.. ఆ సమయంలో తాప్సి అసహనం వ్యక్తం చేసినట్లుగా మీడియాతో మాట్లాడుతూ.. మీడియా సమావేశానికి వచ్చే ముందు కాస్త హోం వర్క్ చేసుకొని రండి ఇష్టానుసారంగా ప్రశ్నలు వేయొద్దు అంటూ క్లాస్ పీకింది. ఆ సమయంలో మీడియా వారు తాప్సి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.