Begin typing your search above and press return to search.
తాప్సీ హెడ్ రిగ్ భలే ఉందే
By: Tupaki Desk | 7 Jun 2019 6:35 AM GMTటాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కే భామామణులు చాలామందే ఉంటారు కానీ అందరూ ముంబైలో జెండా పాతలేరు. సినిమా ఆఫర్లు అయితే వస్తాయి కానీ అక్కడ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు మాత్రం అతి తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే లభిస్తుంది. అలా గుర్తింపు సాధించిన హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో పని చేస్తూ స్టార్డం దిశగా అడుగులు వేస్తోంది తాప్సీ. అలా అని సౌత్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. 'గేమ్ ఓవర్' అనే థ్రిల్లర్ లో నటిస్తోంది. తెలుగు తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. తాప్సీకి బాలీవుడ్ లోఉన్న మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "అవును.. నాకు ఇదెంతో ఫ్యాన్సీగా.. కూల్ గా ఉంది. ఈ హెడ్ రిగ్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఫ్యాషన్ హెడ్ గేర్. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మా సినిమాటోగ్రాఫర్ వసంత్ గారు నా ఫ్యాషన్ డిజైనర్ #గేమ్ ఓవర్.. #యాక్టర్ చేసే పనులు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాలో తాప్సీ ఒక గేమర్ పాత్రలో నటిస్తోంది. దీంతో తను గేమ్ ఆడే సమయంలో వచ్చే సన్నివేశాలు సహజంగా ఉండేందుకు మొహానికి ముందు కెమెరా పెట్టి... తాప్సీ స్క్రీన్ ను ఎలా చూస్తుందో అదే యాంగిల్ లో మనకూ చూపిస్తారన్నమాట.
భలే ఉంది కదా..? అందరూ హీరోయిన్లు అందాల ప్రదర్శన చేస్తూ ఫోటో స్టొరీలు రాయించుకుంటూ ఉంటే ఈ తాప్సీ మాత్రం నటన.. హెడ్ గేర్ అంటూ విభిన్నంగా తన కెరీర్ ను ముందుకు తీసుకుపోతోంది. ఉత్త గ్లామర్ పైన ఆధారపడితే తక్కువ సమయం మాత్రమే కెరీర్ సాగుతుంది.. ఒక నటికీ నిజంగా కావలసిన వాటిపై దృష్టిపెడితే ఖచ్చితంగా కెరీర్ లో లాంగ్ రన్ ఉంటుంది.. ఏమంటారు?