Begin typing your search above and press return to search.

బాలయ్య వందలో ఆమె లేదట

By:  Tupaki Desk   |   27 Jan 2016 11:00 AM IST
బాలయ్య వందలో ఆమె లేదట
X
తాప్సీ తలరాత ఒకే ఒక్క సినిమాతో సూపర్ గా ఛేంజ్ అయిపోయింది. అమ్మడిలో గ్లామర్ వచ్చేసింది. ఒంటికి మెరుపులు కూడా వచ్చేశాయి. అంతా ఏజ్ మహిమ తాప్సీ అనేసినా.. ఇదంతా హిట్ ఇచ్చిన జోష్ అనడంలో సందేహం అక్కర్లేదు. ఫోటో షూట్ లు - కవర్ పేజ్ లతో నానా హంగామా చేస్తున్న తాప్సీ పన్ను.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ, బుల్లితెరపైనా సందడి చేస్తోంది.

తాప్పీ తర్వాత చేయబోయే టాలీవుడ్ మూవీ బాలయ్య సరసన అంటే రీసెంట్ గా వార్తలొచ్చాయి. బాలయ్య బాబు వందో సినిమా ఆదిత్య 999లో తాప్సీని హీరోయిన్ గా తీసుకున్నారని అన్నారు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీలో... తాప్సీ హీరోయిన్ అనడంతో, బాలకృష్ణ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కాంబినేషన్ కొత్త కావడం, ఇప్పటికే హిట్ ట్రాక్ లో ఉండడమే ఇందుకు కారణం. అయితే, అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్ధం కాదంటూ.. తాప్సీ కామెంట్ చేసింది. మొన్న సిసిఎల్‌ మ్యాచ్‌ కు వచ్చినప్పుడు.. అమ్మడుని కొందరు జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. ఈ క్లారిటీ ఇచ్చింది.

దీంతో బాలయ్య వందో సినిమాలో తాప్సీ చేయడం లేదనే విషయం అర్ధమవుతోంది. మరి ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో, ఏ హీరోయిన్ అయినా యాక్సెప్ట్ చేసేస్తుందనడంలో సందేహం అక్కర్లుదు. ఇప్పటివరకూ ఎవరినీ కాంటాక్ట్ చేయకపోవడమే.. హీరోయిన్ విషయంలో కన్ ఫ్యూజన్ కి కారణంగా తెలుస్తోంది.