Begin typing your search above and press return to search.

టాప్ హీరోయిన్స్ పై తాప్సీ ఏడుపు

By:  Tupaki Desk   |   1 Nov 2017 1:30 AM GMT
టాప్ హీరోయిన్స్ పై తాప్సీ ఏడుపు
X
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో బాగానే సెటిల్ అయింది. దక్షిణాది నుంచి నార్త్ కు వెళ్లిన వేరే ఏ హీరోయిన్ తో పోల్చినా అమ్మడికి విజయాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు పెర్ఫామెన్స్.. ఇటు కమర్షియల్ మూవీస్ తో సత్తా చాటేస్తున్న తాప్సీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమోతుతనం తగ్గించుకోలేకపోతోంది.

సహజంగా కొన్ని హిట్స్ వచ్చిన తర్వాత ఓ స్టేటస్ సంపాదించుకున్నాక.. ప్రధానంగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక మనసులో నుంచి కొన్ని రకాల ఫీలింగ్స్ ను బయటకు పంపేస్తారు. రీసెంట్ గానే జుడ్వా2 మూవీతో బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ ను కూడా ఖాతాలో వేసుకున్న తాప్సీ పన్ను.. తనకు ఇంకా టాప్ యాక్ట్రెస్ అంటే అర్ధం తెలియదని.. అస్సలు ఆ మాటే తన కెరీర్ లో వినిపించడం లేదని చెబుతోంది. అసలు టాప్ నటి అన్న మాటకు అర్ధం ఏంటో తెలియడం లేదని.. ఇందుకోసం ఏమైనా స్పెషల్ గా ఎగ్జామ్స్ ఉంటే రాసేందుకు తాను సిద్ధమంటూ వెటకారం కూడా ఆడుతోంది తాప్సీ. తనను ఎవరూ టాప్ హీరోయిన్ గా గుర్తించడం లేదన్నది ఈమె బాధ.

పైగా సక్సెస్ లను బేస్ చేసుకుని ఇలా డిసైడ్ చేసేట్లు అయితే కనుక..తనకు సౌత్ లో ఎక్కువగా ఫ్లాప్స్ ఉండడంతో.. తన కెరీర్ లో వాటి వాటా ఎక్కువగా ఉంటుందని వాపోతున్న తాప్సీ.. టాప్ హీరోయిన్స్ పైనా.. సౌత్ పైనా తన అక్కసు బాహాటంగానే వెళ్లగక్కింది.