Begin typing your search above and press return to search.
అమ్మడు పాకిస్తానీ కాదంటగా...
By: Tupaki Desk | 13 Oct 2016 4:26 AM GMTపింక్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది ఉంగరాల జుత్తు బ్యూటి తాప్సీ పన్ను. ఈ ఢిల్లీ గాళ్ ఇప్పుడు నామ్ షబానా షూటింగుతో బిజీగా ఉన్నప్పటికి.. ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితమే షూటింగ్ పూర్తయిపోయి మరుగున పడిపోయిన రన్నింగ్ షాదీ సినిమా రిలీజుకు నోచుకుంటోందని ఆనంద పడుతోంది. ఇక సౌత్ లో కూడా ఒక సినిమా ఉందిగా మరి.
''ఘాజీ'' సినిమా రిలీజైతే.. తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో అందరికీ చూపిస్తానంటోంది తాప్సీ. అయితే ఈ సినిమాలో అమ్మడు పాకిస్తాన్ శరణార్దిగా నటిస్తోందని వార్తలొచ్చాయి. కాని అది నిజం కాదట. అమ్మడు ఒక బంగ్లాదేశ శరణార్దిగా నటిస్తోందట. ఈ సినిమా కథ ఏంటంటే.. అసలు 1971 యుద్దంలో పాకిస్తాన్ కు చెందిన ఘాజీ అనే సబ్ మెరైన్ విశాఖపట్నం తీరానికి దగ్గర్లో ఎలా కుప్పకూలింది అనేదే కథాంశం. కొందరు బంగ్లాదేశీ ఇన్ఫార్మర్లు అందించిన ఉప్పుతో మన ఆర్మీ ఈ సబ్ మెరైన్ ను కనిపెట్టి కూల్చేశారనేది సినిమా కథేమో అని ఒక అంచనా.
ఏదేమైనా కూడా ఇప్పుడు పాకిస్తానీ నటులన్నా.. అసలు మన సినిమాల్లో మన నటులే పాకిస్తానీయులు వేషాలు వేస్తున్నా.. ఇండియన్స్ కు మండుతోంది. ఈ సమయంలో తాప్సీ తాను పాక్ శరణార్తిని కాదని.. బంగ్లా శరణార్దినని చెప్పడం విశేషం. ఈ గొడవలను చూసి కథను అలా మార్చారంటారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/