Begin typing your search above and press return to search.
అంతొద్దు తాప్సీ
By: Tupaki Desk | 20 Jan 2018 7:22 AM GMTఆ మధ్య దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి గురించి ముంబైలో జరిగిన ఒక పబ్లిక్ టాక్ లో కాస్త వెటకారంగా మాట్లాడుతూ విమర్శల పాలైన తాప్సీ మరోసారి సౌత్ ని టార్గెట్ చేసి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది. సౌత్ కాన్ క్లేవ్ 2018లో మాట్లాడిన తాప్సీ సౌత్ సినిమాలో చాలా అసమానతలు ఉంటాయని అర్థం వచ్చేలా ఒక ఉదాహరణ ఇచ్చింది. ఒక నటి యాక్ట్ చేసిన సినిమాలో హీరో చెప్పాడని తన ఇంట్రో సీన్స్ కట్ చేసిన సంఘటన తనకు తెలుసని, అలాంటివి ఇక్కడే చూస్తామని చెప్పడం అక్కడ ఉన్న వాళ్ళకు ఆశ్చర్యం కలిగించింది. సౌత్ లో తప్ప అలాంటి ఎడిటింగ్ ఇంకే బాషలోను ఉండదు అనేలా తాప్సీ మాట్లాడ్డం పట్ల సినిమా ప్రేమికులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అక్కడితో ఆగలేదు తాప్సీ. తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడంలో కొంత అతిశయోక్తి జోడించడం వింతగా అనిపించింది.
తాను గత సంవత్సరం చేసిన ఆనందో బ్రహ్మ సినిమా ప్రాఫిట్ షేరింగ్ మీద ఒప్పుకున్నానని, ఇది అందరు స్టార్ హీరోలు చేసే పనే కాబట్టి నాకున్న డిమాండ్ కు నేను అలా చేయటం తప్పు లేదనే చేసానని చెప్పిన తాప్సీ తన డేట్స్ కోసమే ఆ దర్శక నిర్మాతలు ఏడాది పాటు వెయిట్ చేసారట. ఇప్పుడు చేస్తున్న మరో సినిమా కూడా తనకు అనుకూలంగా ఉన్నప్పుడే డేట్స్ ఇస్తానని చెప్పానని, వాళ్లు కూడా సరే అని చెప్పి తన డేట్స్ ప్రకారమే వచ్చే హీరోని సెట్ చేసుకుని సినిమా తీస్తామని చెప్పారట. అంటే తాప్సీ ఉద్దేశం తెలుగు సినిమాల్లో తనను తీసుకోవడం ఎంతగా తహతహలాడుతున్నారో చెప్పడానికి కాబోలు.
మరీ ఇంతలా చెప్పుకోవడం తాప్సీకే చెల్లిందని ఇది విన్నవారు కామెంట్ చేస్తున్నారు. ఆనందో బ్రహ్మ సినిమాకు తాప్సీ కన్నా ఎక్కువ పేరు శకలక శంకర్ - శ్రీనివాసరెడ్డి - రాజీవ్ కనకాల - తాగుబోతు రమేష్ లకు వచ్చిందని, అదేదో తను లేకపోతే సినిమానే ఆడేది కాదు అనేలా డాబులకు పోవడం ఎందుకో మరి. అయినా హీరోల డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ తాప్సీ కోసం ఏడాదికి పైగా వెయిట్ చేస్తున్న వాళ్ళెవరో కూడా తాప్సీ చెబితే బాగుండేది.