Begin typing your search above and press return to search.
ఏంటీ.. తాప్సీ గొంతు పెంచేసింది!!
By: Tupaki Desk | 2 Oct 2016 1:30 AM GMTరింగులు జుత్తు గంగ తాప్సీ మొన్నటివరకు హిందీలో కూడా హిట్టులు కొట్టలేని పరిస్థితిలో చిక్కుకుంది. ఎన్ని సినిమాలు చేసినా.. మ్యాగజైన్లకు ఎక్కేసి బ్రాలలో ఫోజులు ఇచ్చినా కూడా అమ్మడికి బ్రేక్ మాత్రం రాలేదు. అయితే అనుకోని అమావస్యనాడు ఫుల్లుగా వర్షం కురిసి కొత్త మొక్కలొచ్చినట్లు.. తాప్సీ కెరియర్లో ''పింక్'' వచ్చిపడింది. దానితో ఇక అమ్మడే రేంజే మారిపోయిందిలే.
వరుసగా గాజీ.. తడ్కా.. నామ్ షబానా వంటి సినిమాలు ఇప్పుడు తాప్సీ కిట్టీలో ఉన్నాయి. అందుకే కాబోలు.. అమ్మడు టాలీవుడ్ ఘోరం బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తోంది. సౌత్ లో తన అనుభవాల గురించి వర్ణించిన ఈ సుందరి.. తెలుగులో ప్రొడ్యూసర్లు తనకు రెమ్యూనరేషన్ సరిగ్గా ఇచ్చేవారు కాదని.. ఒక నిర్మాత ఏకంగా చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశాడని కూడా చెప్పింది. హీరోలకు మాత్రం సినిమాలు ఫ్లాపులైనా భారీగానే ముట్టజెపుతారని.. కాని హీరోయిన్లను మాత్రం తొక్కేస్తారని కామెంట్లు చేసింది.
ఇన్నాళ్ళూ కేవలం సినిమాల్లో సరైన ఆఫర్లు రావడం లేదు అనే చెప్పినా తాప్సీ.. ఇప్పుడు సడన్ గా గొంతు పెంచేసి ఏకంగా ఇండస్ర్టీ మీద నిప్పులు చెరిగేస్తోంది. జాగ్రత్త తాప్సీ.. మీ అక్కయ్య ఇలియానా కూడా అక్కడ రెండు సినిమాలు రాగానే ఇలాగే నోరుపారేసుకుంది. ఇప్పుడేం జరుగుతోందో చూస్తున్నాంగా. వెటకారం కాదండోయ్.. తాప్సీ మంచికోసమే!!