Begin typing your search above and press return to search.
తాప్సి ఎంత వగలుపోయిందో చూడండి
By: Tupaki Desk | 25 Jan 2017 10:54 AM GMTకెరీర్ ఆరంభంలో చాలా వరకు గ్లామరస్ క్యారెక్టర్లే చేసింది తాప్సి. సౌత్ ఇండియాలో దాదాపుగా ఆమె చేసినవన్నీ మామూలు పాత్రలే. ఐతే బాలీవుడ్ వెళ్లాక బేబీ.. పింక్ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పడ్డాయి. అప్పట్నుంచి సౌత్ సినిమాల గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడుతోంది. ఇప్పుడు ‘ఘాజీ’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న తాప్సి.. ఈ సినిమాను ఒప్పుకోవడంలోనూ తాను చాలా తటపటాయించినట్లు తెలిపింది.
‘‘నేను నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఐతే ఘాజీలో నాది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. దీంతో చేయాలా వద్దా అని ఆలోచించాను. నాకు ఈ సినిమాకు ఫుల్ లెంగ్త్ రోల్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే సబ్ మెరైన్ లో లేడీ ఆఫీసర్లు ఉండరు. కాబట్టి నాకు రానా పక్కన అలాంటి పాత్ర ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అందుకే రెఫ్యూజీ క్యారెక్టర్ ఇచ్చారు. అలా మాత్రమే ఓ అమ్మాయి పాత్రను ఇందులో పెట్టడానికి అవకాశముంది. ముందు ఈ సినిమా చేయాలా వద్దా అని ఆలోచించినా.. దర్శకుడు పూర్తి స్క్రిప్టు చెప్పి.. నా పాత్రకున్న ప్రాధాన్యం గురించి వివరించాక.. పీవీపీ వాళ్లు ఎంత కమిట్మెంట్ తో ఈ సినిమా తీస్తున్నారో చూశాక ఒప్పుకున్నా.
రానాతో నేను రెండు సినిమాలు చేశాను. నేను.. అతను బేసిగ్గా తెలుగులో కెరీర్ ఆరంభించినప్పటికీ.. మేం కలిసి సినిమాలు చేసింది వేరే భాషల్లో. ఈ సినిమాతో తెలుగులో తొలిసారి కలిసి నటిస్తున్నాం. నేను తెలుగులోనే హీరోయిన్ గా కెరీర్ ఆరంభించానని ఇకపై గర్వంగా చెప్పుకోవచ్చు. ‘ఘాజీ’ అంతటి ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. ఇండియాలో అందరు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించి అడుగుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో భాగం కావడం నా అదృష్టం’’ అని తాప్సి చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/