Begin typing your search above and press return to search.

త‌మిళోల్లే మంచి ఛాన్సులిచ్చారు -తాప్సీ

By:  Tupaki Desk   |   3 Nov 2015 6:41 AM GMT
త‌మిళోల్లే మంచి ఛాన్సులిచ్చారు -తాప్సీ
X
టాలీవుడ్‌ - కోలీవుడ్ - బాలీవుడ్ .. దున్నేసేందుకు స‌రిహ‌ద్దులే లేవు .. అని అంటోంది చిలిపిక‌ళ్ల తాప్సీ. హ‌ద్దులు చెరిపేశాను. స‌రిహ‌ద్దులు లేపేశాను అంటూ కూనిరాగాలు తీస్తోంది. ఇప్పుడు నేను సై అనాలే కానీ తెలుగులో ఛాన్సులున్నాయ్‌, త‌మిళ్‌ లో వెంట‌ప‌డుతున్నాయ్‌. బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసేందుకు సిద్ధం. నేనే .. నా అంత‌ట నేనుగా కాద‌నుకుంటున్నా త‌ప్ప అవ‌కాశాల‌కు కొద‌వేం లేదు .. అంటూ బాకా ఊదేస్తోంది.

తాప్సీ చెబుతున్న దాంట్లో నిజానిజాలేంటి? అనేదానికి ప్ర‌త్య‌క్ష సాక్ష్యం లేక‌పోయినా.. ఈ అమ్మ‌డి కాన్ఫిడెన్స్ చూస్తుంటే తెలుగులో రొటీన్ క్యారెక్ట‌ర్లు చేసి చేసి విసిగిపోయింది అన్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. గంగ సినిమా త‌ర్వాత సేమ్ టు సేమ్ అలాంటివే ఓ 10 అవ‌కాశాలొచ్చాయి. వాట‌న్నిటినీ కాద‌నుకున్నా. గంగ పెద్ద హిట్ కొట్టింది. ఆ పేరు అలాగే మిగుల్చుకోవాల‌నుకున్నా. అలాగే తెలుగులో ప‌ర‌మ రొటీన్ బోరింగ్ క్యారెక్ట‌ర్ ల‌లో ఛాన్సులిస్తామ‌ని ముందుకొచ్చారు. రొటీన్ గ్లామ్ డాళ్ క్యారెక్ట‌ర్ ల‌కు ఇక్క‌డ కొద‌వేం లేదు. తెలుగులో కంటే త‌మిళ్‌ లో మోర్ ఛాలెంజింగ్ రోల్స్ వ‌చ్చాయి. అందుకే అక్క‌డే ఎంపిక చేసుకుంటున్నా.. అంటూ చెప్పుకొచ్చింది.

ఫ్యూచర్‌ సినిమా గురించి చెబుతూ... సందీప్ కిష‌న్ స‌ర‌స‌న తెర‌కెక్కుతున్న ద్విభాషా చిత్రం లో సైక్రియాటిస్టుగా న‌టిస్తున్నా. ఇదో అద్భుత‌మైన సైన్స్ ఫిక్ష‌న్ ఫిలిం. రెండు భాష‌ల్లోనూ ఇదో డిఫ‌రెంట్ ఎటెంప్ట్ అంటూ తెగ మురిసిపోయింది. మొత్తానికి తెలుగు ఫిలింమేక‌ర్స్ కేవలం గ్లామర్‌ ఒక్కటే అడుగుతున్నారు అంటూ చెప్పేసింది ఈ రింగులు జుత్తు సుందరాంగి.