Begin typing your search above and press return to search.
తాప్సీకి ఆ భయం మొదలైపోయిందట
By: Tupaki Desk | 15 Jun 2016 1:30 PM GMTఢిల్లీ భామ తాప్సీ పన్ను టైం ఇప్పుడు బాగా వెలిగిపోతోంది. కాంచన2 సక్సెస్ తర్వాత అమ్మడి స్పీడ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే తెగ సినిమాలు చేసేస్తోంది. అది కూడా అన్నీ క్రేజీ ప్రాజెక్టులే కావడం అసలు విశేషం. గతేడాది అక్షయ్ కుమార్ తో చేసిన బేబీ తర్వాత.. ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా.. అసలు పండగ ముందుందని చెబుతోంది తాప్సీ.
'తుమ్ హో తో లగ్తా హై' అనే సింగిల్ తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది తాప్సీ. ఈ సింగిల్ కి సంబంధించిన లాంఛింగ్ కార్యక్రమంలో.. ఈమెకు బాగానే ప్రశ్నలు ఎదురయ్యాయి. బాలీవుడ్ లో మీకు బ్రేక్ ఎప్పుడొస్తుందని అడిగితే.. తనకు అదే భయం పట్టుకుందని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకీ అమ్మడి భయానికి అసలు కారణం ఏంటంటే వరుసగా ఈ కుర్రదాని విడుదలయిపోతున్నాయి. పింక్ - తడ్కా చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కానుండడాన్ని గుర్తు చేసింది తాప్సీ.
'అమితాప్ చేసిన పింక్ -* నానా పటేకర్ మూవీ తడ్కాలు విడుదల కానున్నాయి. ఒకేసారి ఇలాంటి క్రేజీ చిత్రాలు వచ్చాక.. ఒక్కసారిగా నా పేరు మీడియాలో నానితే ఆ తర్వాత పరిస్థితేంటి అని భయపడుతున్నా' అంటోంది తాప్సీ పన్ను. అమ్మడి భయంలో అర్ధం ఉంది కదూ.