Begin typing your search above and press return to search.

రింగులు జుత్తు సెక్సిణి దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   11 Jan 2017 4:30 AM GMT
రింగులు జుత్తు సెక్సిణి దూసుకుపోతోంది
X
ఒక్కసారి సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోయాక.. బాలీవుడ్ వెళ్ళి క్లిక్ అవ్వడం అంటే మాటలు కాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి ఆ ఫీట్ ఈజీగానే చేసేసింది కాని.. ఈ తరం స్టార్ హీరోయిన్లు అయిన ఇలియానా.. తమన్నా.. కాజల్ అగర్వాల్.. త్రిష్ లు మాత్రం అక్కడ ఘోరంగా కాజాలు తినేశారు. కాని రింగులు జుత్తు సెక్సిణి తాప్సీ పన్ను మాత్రం.. అక్కడ చక్రం తిప్పుతోందనే అనుకోవాలి.

ఒక ప్రక్కన తన కొత్త హెయిర్ స్టయిల్ చూపిస్తూ వెర్వ్ మ్యాగజైన్ పై అందాలను దారపోస్తూ.. మరో ప్రక్కన న్యూ మోడల్ టాప్ లో కాస్మోపొలిటెన్ మ్యాగజైన్ కవర్ కోసం పూర్తిగా హీటెక్కించేసింది తాప్సీ. ఈ మధ్యన 'పింక్' సినిమాతో సక్సెస్ గాట్టిగా కొట్టడం.. ఆ తరువాత నామ్ షబానా సినిమాలో చేయడం.. అలాగే రన్నింగ్ షాదీ డాట్ కామ్ రిలీజుకు నోచుకోవడం.. ఇలా ఈ సొట్టబుగ్గల బ్యూటి కెరియర్లో అన్నీ ప్లస్సులో జరుగుతున్నాయి. దానికితోడు ఇప్పుడిలా ఒకే నెలలో రెండు మ్యాగజైన్ కవర్లపై అమ్మడు కనిపిస్తోందంటే.. క్రేజ్ పెరుగుతున్నట్లే మరి.

మొత్తానికి సౌత్ లో డజను సినిమాలు చేసినా కూడా హిట్లు వెనకేసుకోలేని తాప్సీ.. బాలీవుడ్ లో మాత్రం కాస్త మాంచి లైనప్పే లైన్లో పెట్టుకుంది. వీటిలో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా కూడా.. అమ్మడు ఖచ్చితంగా పెద్ద స్టార్ అయ్యేందుకు వీలుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/