Begin typing your search above and press return to search.

స్కైలో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ

By:  Tupaki Desk   |   28 Sep 2018 5:29 AM GMT
స్కైలో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ
X
అందాల తాప్సీ కెరీర్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న చందంగా సాగుతోంది. గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌ లో క‌నిపించ‌పోయినా బాలీవుడ్‌ లో త‌న‌దైన‌ హ‌వా సాగిస్తోంది. `జుడ్వా 2` చిత్రంతో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న త‌ర్వ‌తా బాలీవుడ్‌ లో కెరీర్ ప‌రంగా వెనుతిరిగి చూసిందే లేదు. ముంబైలో ఈ దిల్లీ భామ‌ బిజీ నాయిక‌గా రాజ్య‌మేలుతోంది. ఇటీవ‌లే ముల్క్‌ - మ‌న్మార్జియాన్ చిత్రాల‌తో విజ‌యాలు అందుకోవ‌డం త‌న‌కు ర‌క‌ర‌కాలుగా క‌లిసొస్తోంది. వ‌రుస స‌క్సెస్‌ ల నేప‌థ్యంలో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ ప‌దింత‌లు పెరిగింద‌న్న మాటా వినిపిస్తోంది.

ఇటీవ‌లే ప‌లు కార్పొరెట్ బ్రాండ్ల‌కు తాప్సీ సంత‌కాలు చేసింది. గురువారం ఓ వ‌స్త్ర దుకాణం ప్ర‌చారం కోసం హైద‌రాబాద్ న‌గ‌రానికి విచ్చేసిన తాప్సీ రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో అద‌ర‌గొట్టేసింది. ఈ నేప‌థ్యంలో లోక‌ల్ మీడియాలో తాప్సీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌తో తాప్సీ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఒక్కో బ్రాండ్‌ కి కోట్ల‌లో కాంట్రాక్ట్ కుదుర్చుకుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ముల్క్‌ - మ‌న్మార్జియాన్ చిత్రాల‌తో స‌క్సెస్ మాత్ర‌మే కాదు న‌టిగానూ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ క్ర‌మంలోనే యువ‌తరం తాప్సీని అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. త‌న‌ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అందుకే త‌న‌తో బ్రాండింగ్ చేయించేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయిట‌.

ఈ స్పీడ్‌ లోనే ముంబైలో స్టార్ హీరోయిన్ల ఖాతాలో ఉన్న బ్రాండ్ల‌కు ఎస‌రు పెడుతోంది తాప్సీ ప‌న్ను. ఇదివ‌ర‌కూ క‌త్రిన - కంగ‌న‌ బ్రాండ్స్‌ ను టేకోవ‌ర్ చేసింది. ప్ర‌స్తుతం ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ రారాజు లైఫ్‌ స్టైల్‌ కి త‌నే అంబాసిడ‌ర్... ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌ కు ప‌బ్లిసిటీ కోసం విచ్చేసింది. తాప్సీ కిచెన్స్ పేరుతో కిచెన్ సామాగ్రి - వ‌స్త్ర దుకాణాలు - ఫ్యాష‌న్ & ట్రెండ్స్ వ‌గైరా వ‌గైరా బ్రాండ్ల‌కు తాప్సీనే ఓ ఆప్ష‌న్‌ గా మారింది. అయితే త‌న‌వైపు వ‌స్తున్నంత మాత్రాన ప్ర‌తిదానికి సంత‌కం చేసేయ‌దు. ఇటీవ‌లే ఓ ఫెయిర్‌ నెస్ క్రీమ్ కంపెనీ నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్‌ ని తాప్సీ తిర‌స్క‌రించింది. ఇక టాలీవుడ్ కెరీర్ ప‌రిశీలిస్తే.. `ఆనందో బ్ర‌హ్మ` త‌ర్వాత ఈ భామ‌ తెలుగు సినిమాకి సంత‌కం చేయ‌లేదు. అయితే ఇక్క‌డా న‌టించే ఆస‌క్తి ఉంద‌ని చెబుతోంది. టాలీవుడ్‌ లో డెబ్యూ నాయిక‌గా ఆరంగేట్రం చేసి ఇక్క‌డ అగ్ర‌హీరోయిన్ కాలేక‌పోయాన‌న్న ఒకే ఒక్క క‌ల‌త త‌ప్ప ఇంకే దిగులూ కెరీర్ ప‌రంగా లేదు. అయితే ఈ భామ‌కు మెగాక్యాంప్ నుంచి పిలుపు రాక‌పోవ‌డమే టాలీవుడ్ కెరీర్ వెన‌క‌బాటుకు కార‌ణ‌మ‌ని క్రిటిక్స్ విశ్లేషించిన సంగ‌తి తెలిసిందే.