Begin typing your search above and press return to search.
నెటిజన్ల కౌంటర్... తాప్సీ ఎన్ కౌంటర్
By: Tupaki Desk | 18 Nov 2017 5:33 PM GMTమహిళా సాధికారికత గురించి మాట్లాడే నటి తాప్సీని శనివారం నెటిజన్లు ఆటాడుకున్నారు. ట్విటర్ లో తాను పోస్ట్ చేసిన ఒక ఫొటో వల్ల నెటిజన్ల అటాక్ కు గురికావాల్సి వచ్చింది. స్ర్టాప్ లెస్ టాప్... పైగా పెద్దగా మేకప్ కూడా లేకుండా దిగిన ఫొటోను ఆమె ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఆ రా ఇమేజ్ అభిమానులను బాగా నిరాశపరిచినట్లుంది. ఇక దండయాత్ర మొదలుపెట్టారు. అయితే... ఆమె కూడా తానేమీ తక్కువ తినలేదంటూ వారిపై ఎదురుదాడికి దిగింది.
ఎప్పుడూ అందంగా పళ్లని చూపిస్తూ నవ్వుతూ కనిపించే తాప్సీ అలా కనిపించేసరికి ఆమె ఫాలోవర్లకు ఏమాత్రం నచ్చలేదట. ఒకరి తరువాత ఒకరు కౌంటర్లేయడం మొదలుపెట్టారు. కామెంట్ బాక్సును నింపేశారు. అయితే... తాప్సీ మాత్రం ఏమాత్రం వెనక్కుతగ్గలేదు సరికదా వాళ్లకి రివర్స్ అటాక్ ఇచ్చింది. ‘‘ఇలాంటి ఫొటోల వల్లే అమ్మాయిలను మగవాళ్లు అల్లరి చేస్తారు’’ అని ఒక ఫాలోవర్ కామెంట్ చేయగా తాప్సీ స్ర్టాంగ్ డోస్ ఇచ్చింది. ‘‘అలాంటి ఫొటోల్లో తప్పేమీ లేదు.. అలాంటి ఫొటోలను చూసి అల్లరి చేయాలనుకునే మగాళ్లకే ఏదో రోగమున్నట్లు. ఏదైతేనేం.. తొందరగా కోలుకో’’ అంటూ కామెంట్ చేసింది.
ఇంకో యూజర్ అయితే... బట్టలు కొనుక్కోవడానికి డబ్బుల్లేవా లేదంటే ఒళ్లు చూపించాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆ యూజర్ కు కూడా తాప్సీ గట్టి స్ర్టోకే ఇచ్చింది. ‘‘సంస్కృతీ సంప్రదాయాలను రక్షించే నీలాంటివారు దొరకడం లేదు. నీలాంటివాళ్లను కనిపెట్టడానికే ఈ ఫొటో పెట్టాను. ఈ ఫొటో పెట్టకపోతే నీలాంటి వజ్రం దొరకడం కదా’’ అని రిప్లయ్ ఇచ్చింది. కాగా జుద్వా-2 సినిమాలో ఆమెతో నటించిన వరుణ్ ధావన్ వంటివారు మాత్రం తాప్సీని మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. వరుణ్ తాప్సీ కామెంట్లను ఉద్దేశించి సూపర్ తాప్సీ అంటు పోస్ట్ చేశాడు.