Begin typing your search above and press return to search.
సైనాకు అక్కవో సానియాకి చెల్లివో
By: Tupaki Desk | 7 Oct 2018 4:40 AM GMTతాప్సీ కెరీర్ పరంగా పరంగా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తోంది. పింక్ - నామ్ షబానా చిత్రాలతో తనలో ఏదో తెలియని కొత్త గ్లింప్స్. డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్వీన్ గా తనని యూత్ గుర్తించడానికి ఆ రెండు సినిమాలు దోహదపడ్డాయి. సరిగ్గా ఆ సినిమాలతో వచ్చిన మార్పును తన పర్సనల్ లైఫ్‌కి ఆపాదించుకుంది. అథ్లెటిక్ ఉమెన్ గా - కరాటే క్వీన్ గా మారిపోయింది. ఆ క్రమంలోనే తాప్సీ క్యారెక్టర్స్ ఎంపికలు కూడా మారాయి. ఒక రెగ్యులర్ గ్లామర్ క్వీన్ పాత్రల కంటే విభిన్నమైన పవర్ ఫుల్ గా నటించేందుకు ఆస్కారం ఉన్న పాత్రల్ని మాత్రమే అప్పటినుంచి ఎంచుకుంటోంది.
ఇటీవల రిలీజైన ముల్క్ చిత్రంలో లాయర్‌గా కనిపించి షాకిచ్చింది. మొన్నటికి మొన్న `మన్మార్జియాన్`లో ఇద్దరు లవర్స్ తనంటే పడి చచ్చే గొప్ప వ్యక్తిత్వం - ఆకర్షణ ఉన్న అమ్మాయిగా కనిపించి మైమరిపించింది. ఎంపికల్లోనే ఉంది అసలు కథంతా అని తాప్సీకి సైతం ఈ సినిమాలు నిరూపించాయి.
ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిగో లేటెస్టుగా సామాజిక మాధ్యమాల్లో తాప్సీ ఇచ్చిన కిల్లింగ్ లుక్ మతి చెడగొడుతోంది. రాకెట్- కాక్ చేతపట్టి బ్యాడ్మింటన్ క్వీన్ గా మారిపోయింది. సైనాకు అక్కనో - లేక సానియాకి చెల్లినో అనుకునేంత అందంగా కనిపిస్తోంది. అయితే ఇదేమీ సరదాకి కాదు. తాను పూణేకి చెందిన బ్యాడ్మింటన్ టీమ్ కి కో-ఓనర్ గా మారింది. `పీబీఎల్ ఇండియా లైవ్` టోర్నీలో `పూణే సెవన్ ఏసెస్` టీమ్ కి తాప్సీ అండగా నిలిచింది. మొత్తానికి ఆటతో తన జీవనాన్ని సాగిస్తోందని చెప్పొచ్చు.