Begin typing your search above and press return to search.

ప్చ్‌! తాప్సీ ప‌న్నుకి క‌రెంట్ షాక్!!

By:  Tupaki Desk   |   29 Jun 2020 11:45 AM IST
ప్చ్‌! తాప్సీ ప‌న్నుకి క‌రెంట్ షాక్!!
X
ఏపీ-తెలంగాణ‌లో విద్యుత్ బిల్లులు షాక్ కి గురి చేస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఉద్యోగులు లేక మీట‌ర్ బిల్లులు రెగ్యుల‌ర్ గా తీసే వాళ్లు లేక ఇలా అయ్యింద‌ని ప్ర‌భుత్వాలు వివ‌ర‌ణ ఇచ్చుకున్నాయి. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి. ముంబై స‌హా అన్ని మెట్రోల్లో క‌రెంటు బిల్లులు షాక్ కి గురి చేస్తున్నాయి.

ఇలాంటి షాక్ అందాల క‌థానాయిక‌ తాప్సీ ప‌న్నుకి కూడా త‌గిలింద‌ట‌. జూన్ మాసానికి విద్యుత్ బిల్లు చూసి షాక్ తిందిట‌. ఆదివారం మధ్యాహ్నం బిల్లు చూడ‌గానే నోట మాట ప‌డిపోయింద‌ని తాప్సీ తెలిపింది. విద్యుత్ బిల్లులో ఇంత‌టి పిచ్చి పెరుగుదల ఇంత‌కుముందు చూడ‌నేలేద‌ని బోర్డ్ వాళ్ల‌కు ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేసింది తాప్సీ. అయితే కొన్ని గంటల్లోనే.. తాప్సీకి ఆన్ లైన్ లో విద్య‌త్ సంస్థ నుంచి ఈ విషయంపై ఒక వివరణ వ‌చ్చింది.

``కొవిడ్ 19 వ‌ల్ల‌నే స‌మ‌స్య‌. ప్ర‌స్తుతం మీట‌ర్ రీడింగ్ తీసుకోలేక‌పోతున్నాం. మార్చి నుంచి తాత్కాలికంగా నిలిపేశాం. సగటున మూడు నెలల ముందు .. అంటే డిసెంబర్.. జనవరి .. ఫిబ్రవరి.. అలాగే శీతాకాలపు నెలలు కాలానుగుణంగా.. వేస‌విలో లాక్ డౌన్ ప్ర‌భావంతోనూ పెరిగిన వినియోగం ఇందుకు కార‌ణం. ఏప్రిల్- మే - జూన్ నెలల్లో వాస్తవ వినియోగం చాలా ఎక్కువగా ఉంది`` అంటూ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఇఎ.మ్ఎల్) ప్రతినిధి వివ‌ర‌ణ ఇచ్చారు. గత కాలానికి సంబంధించిన బిల్లు మొత్తాన్ని మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (మెర్క్) మార్గదర్శకాల ప్రకారం లెక్కించామ‌ని తెలిపారు.

తాము కొత్త‌గా దిగిన అపార్ట్ మెంట్ లో ఇంత పెద్ద వ‌సూల్ ఎలా? అంటూ తాప్సీ ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. తాప్సీ షేర్ చేసిన బిల్లులు పరిశీలిస్తే.. 2020 జూన్ లో రూ .36000 వ‌సూలు చేయ‌గా.. ఈ బిల్లుతో పోలిస్తే పాత‌వి చాలా ప‌రిమితం. ఏప్రిల్ బిల్లు రూ .4390 కాగా.. మే నెలలో రూ .3850 మాత్రమే ఉంది. ఇంత‌టి భారీ తేడా చూసి షాక్ కి గుర‌య్యాన‌ని తాప్సీ వెల్ల‌డించింది. తాజా నివేద‌న‌తో ఎల‌క్ట్రిసిటీ బోర్డ్ ఫిర్యాదును స్వీక‌రించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని ప్రామిస్ చేసింది.