Begin typing your search above and press return to search.
చెంపదెబ్బ కౌంటర్ కు హీరోయిన్ రివర్స్ కౌంటర్
By: Tupaki Desk | 9 March 2020 9:00 AM GMTతాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తప్పడ్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భర్త నలుగురిలో చెంపదెబ్బ కొట్టడంతో హర్ట్ అయిన భార్య ఏకంగా విడాకుల వరకు వెళ్లే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కథపై కొందరు విమర్శలు చేస్తున్నారు. దర్శకుడు అహ్మద్ ఖాన్ తన భాగీ 3 చిత్రం ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తప్పడ్ కథాంశంపై స్పందించాడు.
భర్త ఒక దెబ్బ కొడితే భార్య విడాకులకు వెళ్లడం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. నా భార్యను నేను ఒకటి కొడితే నన్ను ఆమె తిరిగి కొడుతుంది. దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నాడు. చిన్న చిన్న గొడవలను విడాకుల వరకు తీసుకు వెళ్లే కాన్సెప్ట్ ఏంటో అంటూ కాస్త ఎటకారంగా మాట్లాడాడు. దర్శకుడి విమర్శలపై తాప్సి సున్నితంగా స్పందించింది. తప్పడ్ కాన్సెప్ట్ ను ఉద్దేశించి అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ తాప్సి సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పింది.
ఒక్కో దర్శకుడికి ఒక్కో ఆలోచన ఉంటుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇతరు అభిప్రాయాలకు విలువను ఇచ్చుకున్న సమయంలోనే అందరికి బాగుంటుంది. మాకు ఎది కరెక్ట్ అనిపిస్తే అదే తీశాం. ఆ అభిప్రాయంను గౌరవించకుండా విమర్శు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ తాప్సి సున్నితంగా దర్శకుడు అహ్మద్ ఖాన్‌పై కామెంట్స్ చేసింది. తాప్సి కౌంటర్ కు దర్శకుడు అహ్మద్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.