Begin typing your search above and press return to search.

పాత ప్రేమ కథ వివరించిన తాప్సీ

By:  Tupaki Desk   |   19 Jan 2019 1:30 AM GMT
పాత ప్రేమ కథ వివరించిన తాప్సీ
X
'మీటూ' అని ఎవరైనా పొరపాటున అంటే 'నేను కూడా' అనే అర్థంలో తీసుకోవడం లేదు. లైంగిక వేధింపులకు గురైనవారు వారికెదురైన సమస్యలు చెప్పుకుంటున్నారని అనుకుంటారు. కానీ ఇది అది కాదు. ఈమధ్య చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తమ క్రష్ లు... డేటింగ్ లు.. పాత ప్రేమ కథలపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కరణ్ జోహార్.. నేహా ధూపియా లాంటి వారు తమ షోల ద్వారా ఓపెన్ గా మాట్లాడించడంతో మిగతా సెలబ్రిటీలు కూడా అదే బాటలో నడుస్తున్నారు.

ఈమధ్యనే శ్రీమతి దీపిక పెళ్ళికి ముందు తన ప్రేమాయణాలపై ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. టీనేజ్ వయసునుండి అసలు ఆమె ఖాళీగానే లేదట. ఎవరో ఒక అబ్బాయితో డేటింగ్ లో ఉండేదానినని ఓపెన్ గా చెప్పేసింది. ఇప్పుడు డింపుల్ బ్యూటీ తాప్సీ ఈ డేటింగులకు సంబంధించి మీటూ అనేసింది. ఈ అమ్మడు 9 వ తరగతి చదువుతున్నప్పుడే ఒక అబ్బాయితో ప్రేమాయణం సాగించిందట. ఆ కాలంలో ఈ వాట్సాపులు గట్రా లేవు కాబట్టి తమ ఇంటి ఎదురుగా ఉన్న ఎస్టీడీ బూతుకు వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కు ఫోన్లు చేసి మరీ కబుర్లు చెప్పేదట.

'నా ఆటోగ్రాఫ్' సినిమాలో లాగా టీనేజ్ ప్రేమాయణాలు ఇంటెన్స్ గా ఉంటాయిగానీ ఎక్కువ కాలం సాగవు కదా! అలానే ఆ కథ కూడా ఎగ్జామ్స్ టైముకల్లా ముగిసిందట. దీపిక స్టైల్ లోనే పెద్దగా గ్యాపు లేకుండా మరో బాయ్ ఫ్రెండును లైన్ లో పెట్టిందా లేదా అనేది వెల్లడించలేదు. అయినా మన పిచ్చిగానీ అందరికీ నా ఆటోగ్రాఫులు ఉంటాయి. అన్నీ చెప్తారా.. ఆశ దోశ అప్పడం వడ!