Begin typing your search above and press return to search.
పీరియడ్స్ గురించి ఓపెన్ అవ్వాలి
By: Tupaki Desk | 29 Aug 2017 7:00 AM GMTసినిమా తారలు సామాజిక కోణంలోంచి సమస్యలను చూసే కల్చర్ బాగానే ఊపందుకుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమకు తోచిన సమస్యపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఫెమినిటీ భావజాలం పెరిగిన తర్వాత.. మహిళల సమస్యలపై హీరోయిన్స్ ఓపెన్ గా మాట్లాడే క్రమం బాగానే పెరిగింది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు తాప్సీ పన్ను కూడా వీరికి తోడైంది.
ఐఐటీ ముంబై విద్యార్ధులతో కలిసి మహిళలో శానిటరీ ఎడ్యుకేషన్ పై ప్రచారం కల్పించేందుకు తాప్సీ సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు శానిటరీ నాప్కిన్స్ కూడా పంపిణీ చేయనుంది ఈ హీరోయిన్. " మహిళల్లో రుతుక్రమం అనేది ఎందుకు ఓ నిషేధించిన సబ్జెక్ట్ మాదిరిగా చూస్తారో నాకు అర్ధం కాదు. జనాల మైండ్ సెట్ మారాలి. పీరియడ్స్ గురించి ఓపెన్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలామంది మహిళలు దీనిపై కోడ్ లాంగ్వేజ్ లో సిగ్నల్స్ ఇస్తుంటారు. బహుశా అందుకే ఇంతకాలం పాటు మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగు అవకపోవడానికి కారణం కావచ్చు" అంటోంది తాప్సీ పన్ను.
"ఆడవారిలో రుతుక్రమం అనేది సాధారణమైన విషయం. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు మరింతగా దీనిపై అర్ధం చేసుకుంటారు" అని అభిప్రాయపడిన తాప్సీ.. ప్రకృతి సహజమైన ఓ విషయాన్ని.. జనాలు ఎందుకు సమస్యగా మార్చేశారని నిలదీస్తోంది. విద్యార్ధులు ఈ విషయంపై ముందడుగు వేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందించింది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను.