Begin typing your search above and press return to search.

తాప్సీ వాళ్ళను డామినేట్ చేసిందట!

By:  Tupaki Desk   |   12 Sept 2018 7:00 AM IST
తాప్సీ వాళ్ళను డామినేట్ చేసిందట!
X
సహజంగా కొంతమంది హీరోలు గానీ హీరోయిన్లు కానీ ఒక ఫ్రేమ్ లో ఉంటే వాళ్ళను ఇతర నటులు వారిని డామినేట్ చేయడం చాలా కష్టం. ఉదాహరణకు చిరంజీవి... రజనీకాంత్ పేర్లు చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు స్క్రీన్ మీద ఉంటే ప్రేక్షకుల దృష్టి వారి పక్కన ఉండే వారి మీదకు పోదు. పక్కన పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా వీరిని దాటి ఆడియన్స్ దృష్టి లో పడడం చాలా కష్టం. బాలీవుడ్ హీరోయిన్ల సంగతే తీసుకుంటే కంగనా లాంటి వారు అదే కేటగిరీ. ఇక డింపుల్ బ్యూటీ తాప్సీ కూడా ఆ లిస్టు లో చేరేలా ఉంది.

ఇప్పటికే 'పింక్'.. 'ముల్క్' లాంటి కంటెంట్ బెస్డ్ సినిమాలలో తన స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా 'మన్మర్జియాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ - విక్కీ కౌశల్('సంజు' లో రణబీర్ ఫ్రెండ్) ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మర్జియాన్' సినిమాను రీసెంట్ గా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారట. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ. కానీ తాప్సీ తన నటనతో ఇద్దరూ హీరోలను డామినేట్ చేసిందట. ఈ సినిమాలో తాప్సీ నటనపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సీరియస్ సినిమాలలో హీరోను డామినేట్ చేసిందంటే సరే అనుకోవచ్చు గానీ రొమాంటిక్ కామెడీలో వాళ్ళను ఎలా డామినేట్ చేసింది అనే విషయం సినిమా రిలీజ్ అయితే గానీ మనకు తెలీదు. అన్నట్టు ఈ సినిమా సెప్టెంబర్ 14 న రిలీజ్ అవుతోంది.