Begin typing your search above and press return to search.

తాప్సీని ప‌డేశాడుగా...

By:  Tupaki Desk   |   23 March 2018 7:27 AM GMT
తాప్సీని ప‌డేశాడుగా...
X
ద‌ర్శ‌కేంద్రుడి ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ ప‌న్ను. అయితే ఎన్ని సినిమాలు చేసినా, స్టార్ స్టేట‌స్ మాత్రం సొంతం చేసుకోలేక‌పోయింది. గోపిచంద్ స‌ర‌స‌న చేసిన ‘సాహ‌సం’ సినిమా త‌ర్వాత అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో బాలీవుడ్‌పైన ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఆ మ‌ధ్య రాఘ‌వేంద్ర‌రావుపైన కామెంట్ చేసి, తెలుగు వారి కోపానికి కూడా గురైంది.

ఈ మ‌ధ్య‌నే ‘ఆనందో బ్ర‌హ్మ‌’ సినిమా చేసిన తాప్సీ, దాని త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. బాలీవుడ్‌లోనే బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి, ఓ యువ‌కుడు రాసిన‌ ప్రేమలేఖను చ‌దివి ఫిదా అయిపోయింద‌ట‌. ‘మందు ముట్ట‌నూ, మాంసం ముట్ట‌నూ... అన్నింటికంటే ముఖ్యంగా నేను వ‌ర్జీన్‌నీ... నీ మీద నాకున్న ప్రేమ‌ను నిరూపించేందుకు నార్కొటిక్ ప‌రీక్ష‌కైనా, లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కైనా నేను సిద్ధ‌మే. నా మెద‌డును పూర్తిగా ప‌రీక్షించ‌డం మాత్రం మ‌ర‌వ‌ద్దు...’ అంటూ ఓ అభిమాని చేసిన ఈమెయిల్ ప్రపోజ‌ల్ తాప్సీకి బాగా న‌చ్చ‌డంతో త‌న అకౌంట్‌లో షేర్ చేసింది. ‘బెస్ట్ ప్ర‌పోజ‌ల్ ఎవ‌ర్‌... వెజిటేరియ‌న్ ల‌వ్‌, ఇంత‌కు మించి జీవితంలో ఇంకేం కావాలి...’ అంటూ కామెంట్ చేసింది.

తాప్సీ పెట్టిన పోస్టు ఆమె అభిమానుల‌ను కుసింత కుళ్లుకునేలా చేసినా చేయొచ్చు. ఇంత‌కీ తాప్సీ ఈ బెస్ట్ ప్ర‌పోజల్‌ను అంగీక‌రించిన‌ట్టేనా...! లేదా! ఏమో మ‌రి. అయితే ద‌క్షిణాదిలో న‌ట‌న‌కు కాకుండా హీరోయిన్ల అందాల‌కే ప్రాముఖ్యం ఇస్తార‌ని చెప్పిన తాప్సీ, బాలీవుడ్‌లో న‌టించిన ‘జుడ్వా 2’ చిత్రంలో బికినీ ధ‌రించి రెచ్చిపోయి, అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది.