Begin typing your search above and press return to search.
తుపాకీ భామలు - పోస్టర్ టాక్
By: Tupaki Desk | 16 April 2019 5:45 AM GMTసౌత్ లో అవకాశాలు వచ్చినా పెద్దగా రాణించలేకపోయిన తాప్సి పన్ను బాలీవుడ్ లో మాత్రం జెండా గట్టిగానే పాతింది. విభిన్నమైన పాత్రలతో వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఏ ముహూర్తంలో పింక్ చేసిందో కానీ అప్పటి నుంచి వెనుదిరిగి చూసే అవసరం పడలేదు. ఇటీవలే విడుదలైన బదలా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో పోటీ పడి నటిస్తూ రెండు హిట్లు కొట్టడం అంటే సామాన్యమా.
ఇప్పుడు తాప్సి నటిస్తున్న మరో సినిమా ఆసక్తి రేపుతోంది. అదే సాండ్ కి ఆంఖ్. దీపావళిని టార్గెట్ చేసుకుని అక్టోబర్ లో విడుదల కానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. ఇందులో తాప్సి తో పాటు టాయిలెట్ ఫేమ్ భూమి పెడ్నేకర్ కీలక పాత్ర పోషిస్తోంది. తుషార్ హిరనందాని దర్శకుడు.
ఇదో వెరైటీ బయోపిక్. ప్రకాశి తోమర్ చంద్రూ తోమర్ అనే ఇద్దరు తోడికోడళ్ల కథ ఇది. అలా అని వీళ్ళేదో ఆషామాషీ బ్యాచ్ కాదు. షార్ప్ షూటర్స్ గా పేరున్న వీళ్ళు చేతిలో గన్ లేనిదే బయటికి రారు, గురి పెట్టి కాల్చారు అంటే ఎంత దూరం ఉన్నా లక్ష్యమైన సరే నేలకొరగాల్సిందే. ముందు దీనికి అనుకున్న పేరు ఉమనియా. అయితే టైటిల్ కాపీ వివాదంలో చిక్కుకోవడంతో నిర్మాతల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ సాండ్ కి ఆంఖ్ వైపు మొగ్గు చూపారు.
విక్కీ-ప్రకాష్ ఝా-వినీత్ కుమార్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సాండ్ కి ఆంఖ్ మీద బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. స్టార్లు లేకుండా కేవలం తాప్సి భూమిలతోనే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే 30 ఏళ్ళ వయసున్న ఈ ఇద్దరు బ్యూటీలు ఇందులో 60 ఏళ్ళ డైనమిక్ భామల పాత్రను పోషించడం.