Begin typing your search above and press return to search.
'శభాష్ మిథూ' టీజర్: మిథాలీ పాత్రలో ఒదిగిపోయిన తాప్సీ..!
By: Tupaki Desk | 21 March 2022 7:38 AM GMTఇప్పటి వరకు వెండితెర మీద అనేక మంది భారతీయ క్రీడాకారులు జీవిత చరిత్రలు ఆవిష్కరించబడ్డాయి. క్రికెటర్స్ లో ఎంఎస్ ధోనీ - అజారుద్దీన్ - కపిల్ దేవ్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథాంశంతో తెరకెక్కిన ''శభాష్ మిథూ'' సినిమా బాక్సాఫీస్ వద్దకు వస్తోంది.
''శభాష్ మిథూ'' చిత్రంలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నూ టైటిల్ రోల్ ప్లే చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను ప్రధానాంశాలుగా ఈ సినిమా రూపొందింది.
వన్డేల్లో వరుసగా 7 హాఫ్ సెంచరీలు.. 4 వరల్డ్ కప్ టోర్నీలలో కెప్టెన్ గా.. టెస్టులో డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా.. 23 ఏళ్లుగా టీమిండియాకు సేవలందించిన ఏకైక క్రికెటర్ మిథాలీ అని ఈ టీజర్ లో పేర్కొన్నారు. జెంటిల్ మెన్ స్పోర్ట్ లో చరిత్ర సృష్టించడానికి ఆమె ఇబ్బంది పడలేదు.. నిజం చెప్పాలంటే, ఆమె చరిత్ర తిరగరాసిందని తెలిపారు.
టీజర్ చివర్లో క్రేజులో బ్యాటింగ్ చేస్తూ.. బాల్ కోసం ఇంటెన్స్ గా చూస్తున్న తాప్సి ని చూపించారు. మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ ఒదిగిపోయినట్లు తెలుస్తుంది. దీని కోసం ఆమె తీవ్రంగా శ్రమించింది. సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు నుంచే సీరియస్ గా క్రికెట్ ప్రాక్టీస్ చేసింది. బ్యాటింగ్ - బౌలింగ్ లో శిక్షణ కూడా తీసుకుంది.
కొన్నేళ్లపాటు భారతీయ మహిళల క్రికెట్ కు సారథ్యం వహించిన లివింగ్ లెజెండ్ మిథాలీ రాజ్ జీవితంలో అనేక అద్భుత ఘట్టాలున్నాయి. ఓ మహిళా క్రీడాకారిణిపై వస్తున్న బయోపిక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే లేటెస్టుగా వచ్చిన టీజర్ లో సినిమాకు సంబంధించిన కంటెంట్ ఏమీ చూపించలేదు. కేవలం మిథాలీ రాజ్ సాధించిన రికార్డులను మరోసారి గుర్తు చేశారు. మరి త్వరలో రాబోయే ట్రైలర్ లో అయినా మిథాలీ జీవిత విశేషాలను ప్రస్తావిస్తారేమో చూడాలి.
ఇకపోతే 'శభాష్ మిథు' చిత్రానికి ముందుగా రాహుల్ దొలాకియా దర్శకత్వం వహిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆయన తప్పుకోవడంతో డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ ఈ బయోపిక్ ని తెరకెక్కించే బాధ్యతలు తీసుకున్నారు. వాయ్ కామ్18 స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ.. కుదరలేదు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి 'శభాష్ మిథూ' సినిమా తాప్సీ పన్నుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.