Begin typing your search above and press return to search.

ఫ్యాన్ పెళ్లికి సిటీకి రానున్న తాప్సీ

By:  Tupaki Desk   |   20 Feb 2017 3:20 PM GMT
ఫ్యాన్ పెళ్లికి సిటీకి రానున్న తాప్సీ
X
సినిమా రంగానికి చెందిన వారిని వారి అభిమానులు ఎంతగా అభిమానించి.. ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. సినీ నటుల అభిమానుల సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వారి కోసం వారు చేసే త్యాగాలు ఒక రేంజ్లో ఉంటాయి. వారి కోసం.. తమ వ్యక్తిగత సమయాన్ని మాత్రమే కాదు.. తమకున్న అభిమానాన్ని ప్రదర్శించుకునే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు.

మరింతలా అభిమానించే అభిమానుల పట్ల నటులు ఎలా రియాక్ట్ అవుతారన్న విషయానికొస్తే.. అందరూ కాకున్నా కొందరు మాత్రం అభిమానుల మాదిరే స్పందిస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణ తాప్సీ పొన్ను. తాజా ఘాజీ సినిమాలో చిన్న పాత్రే అయినా కీలకమైన భూమిక పోషించిన ఆమె.. తన ఫ్యాన్ పెళ్లికి వచ్చేందుకు సిద్ధం కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనను ఎంతో అభిమానించే అభిమాని పెళ్లి సికింద్రాబాద్ లో మార్చి నెలలో జరగనుంది. అతడి పెళ్లికి వస్తానని ఆమె చెప్పేసింది. అంతేనా.. తన అభిమాని గురించి చెబుతూ.. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి ఎంతగానో అభిమానిస్తుంటాడు. తరచూ మొయిల్స్.. ఛాట్ చేస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి. గౌరవంగా చూస్తాడు. తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానాన్ని పంపాడు. అందుకు నేను ఓకే చెప్పాను. అంతలా అభిమానించే అభిమాని పెళ్లికి వెళ్లకపోతే ఎలా?’’ అని చెప్పేసింది.
అభిమాని పెళ్లికి ఒక్క రోజు హైదరాబాద్ కు వచ్చేసి.. ఆ వెంటనే తాను తిరిగి వెళ్లనున్నట్లుగా చెప్పింది. ఎప్పుడూ అభిమానుల అభిమానం గురించి కబుర్లు వినే వేళ.. అభిమానుల పట్ల సినీ ప్రముఖుల ఇలా స్పందించటం అందరిని ఆకర్షిస్తోంది. అభిమానిని ఇంతగా అభిమానించే తాప్సీని అభిమానించే అభిమానులు మరింత మంది పెరగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/