Begin typing your search above and press return to search.
మళ్లీ ఎక్స్ పోజింగ్ లోకి దిగిందిగా
By: Tupaki Desk | 4 July 2017 4:55 PM GMTఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఆ మధ్య బాగానే బింకం ప్రదర్శించింది. బాలీవుడ్ లో ఓ హిట్టు పడడం.. అమితాబ్ బచ్చన్ మూవీలో నటించినా.. ఈ భామ చేసిన పాత్రకు ఆమె నటనకు ప్రశంసలు రావడంతో.. ఇక బాలీవుడ్ కిరీటం తనకు దక్కేసినట్లే అని ఫిక్స్ అయిపోయింది. తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ పై.. సౌత్ సినిమాలపై బాగానే సెటైర్స్ వేసింది తాప్సీ.
కానీ బాలీవుడ్ లో టైం ఛేంజ్ అవడానికి పెద్దగా టైం పట్టదు. ఈ భామ నటించిన ఘాజీ అటాక్ సక్సెస్ అయినా.. తాప్సీకి దక్కిందేమీ లేదు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న నామ్ షబానా మూవీ బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. అప్పుడు మళ్లీ సౌత్ సినిమాల్లో నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్స్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మళ్లీ తన అందాల రూట్ లోకి వచ్చేసింది. తాజాగా ఏషియాస్పా మేగజైన్ కోసం తాప్సీ చేసిన ఫోటోషూట్ చూస్తే అవాక్కవాల్సిందే. ఈ మధ్య కాలంలో ఎన్నడూ కనిపించనంత గ్లామర్ గా ఆ మేగజైన్ కవర్ పేజ్ పై దర్శనం ఇచ్చింది ఈ భామ. గతంలో చెప్పిన ట్యాలెంట్ కబుర్లన్నీ పక్కన పెట్టేసి.. మళ్లీ ఎక్స్ పోజింగ్ లోకి దిగేసిందిగా అనిపించక మానదు.
బ్లాక్ అండ్ వైట్ టాప్ తో.. క్లీవేజ్ అందాలు కుమ్మరించేస్తూ.. డిఫరెంట్ హెయిర్ కట్ తో.. కొత్త గ్లామర్ తో కనిపిస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. హలోబ్రదర్ రీమేక్ అయిన జుడ్వాకు సీక్వెల్ లో నటిస్తున్న తాప్సీ.. ఉలవచారు బిర్యానీకి రీమేక్ గా రూపొందుతోన్న తడ్కాలో కూడా యాక్ట్ చేసేస్తోంది.