Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీట్‌ కి ల‌క్ష‌లు ప‌ట్టేస్తోంది

By:  Tupaki Desk   |   15 Jan 2016 6:13 AM GMT
ఒక్క ట్వీట్‌ కి ల‌క్ష‌లు ప‌ట్టేస్తోంది
X
ప‌బ్లిసిటీలో స్టంట్ మారుతోంది. ఇప్పుడున్న ఆన్‌ లైన్ యుగంలో ప్ర‌తిదీ ఫేస్‌ బుక్‌ - ట్విట్ట‌ర్‌ - ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో పోస్ట్ అయిపోతున్నాయ్‌. సెల‌బ్రిటీల ఫ్యాన్స్ కూడా వాటిలోనే ఎక్కువ‌గా క‌నెక్ట‌యిపోయి ఉన్నారు. క్ష‌ణాల్లో ఏ స‌మాచారాన్ని అయినా ఆన్‌ లైన్‌ లో సామాజిక వెబ్‌ సైట్ల‌లో పోస్టింగ్ చేస్తే చాలు వెంట‌నే అంద‌రికీ రీచ్ అయిపోతోంది. స‌రిగ్గా ఇదే అవ‌కాశాన్ని కొన్ని బ్రాండ్లు తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాయ్‌. ఫేవ‌రెట్ సెల‌బ్రిటీల‌తో ట్వీట్లు చేయించుకుంటూ అలా ట్వీట్ చేసినందుకు భారీ మొత్తాల్ని ముట్ట‌జెబుతున్నాయ‌న్న‌ది ఓ స‌ర్వేలో తెలిసింది.

లేటెస్టుగా అందాల నాయిక తాప్సీ ట్విట్ట‌ర్‌ లో ఓ బ్రాండ్ గురించి ప్ర‌మోట్ చేసింది. అది చెప్పుకోద‌గ్గ ఫేమ‌స్ బ్రాండ్ కానే కాదు. అయినా త‌ను షేరింగ్ చేసింది కాబ‌ట్టి ఫ్యాన్స్ అంతా ఫాలో అయిపోయారు. అయితే తాప్సీ ఇలా ట్విట్ట‌ర్‌ లో స‌ద‌రు బ్రాండ్‌ ని ఉచితంగానే ప్ర‌మోట్ చేసిందా? అంటే అలాంటిదేం లేదు. ఆ బ్రాండ్ రేంజుని బ‌ట్టి 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం అందుకుంద‌ని చెబుతున్నారు. ఇలా ట్విట్ట‌ర్‌ లో ట్వీట్లు చేస్తున్నందుకు కార్పొరెట్ కంపెనీలు సెల‌బ్రిటీల‌కు బాగానే పే చేస్తున్నాయి. ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ కేవ‌లం త‌మ‌కి ఉన్న పాపులారిటీ దృష్ట్యా సంపాదించుకునే అవ‌కాశం ఉంద‌ని, దానిని తాప్సీ తెలివిగా క్యాష్ చేసుకుంటుంద‌ని చెబుతున్నారు.

బాప్ రే.. ఐడియా ఉంటే సంపాద‌న‌కు బోలెడ‌న్ని మార్గాలు. అప్ప‌ట్లో స్నేహితుల‌తో క‌లిసి వెడ్డింగ్ ప్లాన‌ర్ వృత్తి మొద‌లెట్టింది. ఇప్పుడిలా కూడా సంపాదించేస్తోంది తాప్సీ. మ‌రోవైపు బాలీవుడ్‌ లో వ‌రుస‌గా న‌టించేస్తోంది. అదీ మ్యాట‌ర్‌.