Begin typing your search above and press return to search.
గాయాలు చూపెడితే హిట్టిస్తారా మ్యామ్?
By: Tupaki Desk | 9 Jun 2019 6:55 AM GMTబాబోయ్! కాళ్లు విరిగాయ్..! చేతులు బొబ్బలెక్కాయ్..!! ఆ ఫోటోలు చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎంతో సుకుమారంగా ఉండే హీరోయిన్ కి అంత కష్టం ఏం వచ్చింది? అంటే తీవ్రంగా గాయాల పాలైన ఆ హీరోయిన్ చెప్పిన నిజాలు షాకిస్తున్నాయ్. ఇంతకీ ఎవరా భామ? అసలేం జరిగింది? అంటారా.. అయితే వివరాల్లోకి వెళ్లాలి.
అందాల తాప్సీ ప్రస్తుతం `గేమ్ ఓవర్` అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వీడియో గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ పాత్ర ఎక్కువ భాగం వీల్‌చైర్‌లోనే కనిపిస్తుంది. అలాగని నటనకు స్కోప్ లేదా? అంటే పూర్తిగా యాక్షన్ మోడ్ లో ఆద్యంతం రక్తి కట్టించే చిత్రమిదని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సుల కోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. అంతేకాదు మంచు కొండల్లో ఎవరూ ఊహించని రీతిలో సాహసాలు చేసి లేనిపోని తిప్పలకు గురైందట.
అందుకు సంబంధించి గత కొంతకాలంగా పోటోలు- వీడియోల్ని తాప్సీ సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేస్తోంది. తాజాగా రివీల్ చేసిన ఈ ఫోటో అభిమానుల్ని షాక్ కి గురి చేసింది. ఈ ఫోటోలో తాప్సీ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులూ ఎర్రగా బొబ్బలు తేలి కనిపిస్తున్నాయి. ఇక కాళ్లకు అయితే సిమెంట్ కట్లు వేసేశారు. అంటే కాళ్లు విరిగినంత పని అయ్యిందా? అన్నది తాప్సీనే చెప్పాలి. ఆ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఎక్కడ తెరకెక్కించారు? అంటే.. ఎత్తైన మంచు కొండల్లో ఈ సినిమా షూటింగ్ చేశారట. అక్కడే ఇలా దెబ్బలు తినాల్సొచ్చిందని తాప్సీ వెల్లడించారు. ఈనెల `14న గేమ్ ఓవర్` తెలుగు- తమిళంలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు హైదరాబాద్ మీడియాతో ముచ్చటించేందుకు తాప్సీ చెన్నయ్ నుంచి వస్తున్నారు. అశ్విన్ శరవణన్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రిలీజ్ కి మరో ఐదు రోజులే ఉంది కాబట్టి ప్రచారంలో వేగం పెంచింది టీమ్. ఇక తాప్సీ ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి విస్త్రత ప్రచారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో జోరుమీదున్న తాప్సీ సౌత్ లోనూ ఆ రేంజు అందుకోవాలని తహతహలాడుతోంది. ఆ క్రమంలోనే డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంపిక చేసుకుంటోంది. ``మంచుతో కప్పబడిన కొండ ప్రాంతంలో 25 రోజుల పాటు షిఫాన్ చీరతో షూటింగ్ చేయాల్సి వచ్చింది. అది ఎంతో కష్టంతో కూడుకున్నది. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను`` అంటూ కామెంట్ చేశారు. అంటే కాళ్లకు దెబ్బలు తగల్లేదు. కానీ మంచులో గడ్డ కట్టుకోకుండా ఇలా ప్లాస్టిక్ కట్లు కట్టించుకున్నారన్నమాట.