Begin typing your search above and press return to search.
సెన్సేషనల్ బయోపిక్ లో తాప్సి
By: Tupaki Desk | 5 Sep 2016 10:30 PM GMTసౌత్ సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పేసినట్లే ఉంది తాప్సి. ఇప్పుడు ఆమె దృష్టంతా హిందీ సినిమాల మీదే ఉంది. వరుసగా మంచి మంచి అవకాశాలే పట్టేస్తోంది తాప్సి. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ.. తనేంటో ప్రూవ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు పట్టేస్తోంది. ‘బేబీ’లో ఆమె పెర్ఫామెన్స్ ‘పింక్’లో ఛాన్స్ దక్కేలా చేస్తే.. ‘పింక్’ విడుదల కాకముందే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది తాప్సి. బహుశా ఈ పాత్ర ఆమె కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. మణిపూర్ ఐరెన్ లేడీ షర్మిల పాత్రలో కనిపించబోతోందట తాప్సి. షర్మిల జీవిత కథతో సినిమా తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాత హన్సల్ మెహతా సన్నాహాలు చేస్తున్నాడు. కొత్త దర్శకుడు వికాస్ ద్వివేది ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.
షర్మిల గురించి పరిచయం అక్కర్లేదు. మణిపూర్ లో ప్రత్యేక సైనిక బలగాల ఆకృత్యాలకు వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు పోరాటం చేసింది షర్మిల. అన్నేళ్ల పాటు ఆమె భోజనమే చేయలేదు. కేవలం ద్రవ పదార్థాల మీదే బతికింది. ఎవరెంత ప్రయత్నం చేసినా దీక్ష విరమించని షర్మిల.. ఎట్టకేలకు కొన్ని రోజుల కిందట పంతం వీడింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఆమె పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చేదే. షర్మిల పాత్రకు తాప్సి బాగానే సరిపోయే అవకాశముంది. కాకపోతే పెర్ఫామెన్స్ మాత్రం అంత సులువు కాదు. పైగా నిరాహార దీక్ష చేసి చిక్కిపోయినట్లు కనిపించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తిండి కూడా మానాల్సి ఉంటుంది. మరి తాప్సి ఏం చేస్తుందో.. ఎలా చేస్తుందో?