Begin typing your search above and press return to search.
బదలా బేబీ దానికి సూటవ్వదేమో!
By: Tupaki Desk | 9 Aug 2019 4:19 AM GMTగత కొన్నేళ్ళుగా నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని సినిమా పరిశ్రమలను ఊపేస్తున్న బయోపిక్ ల ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఎప్పుడో కాలం చేసిన రాజకీయ నాయకులు సినిమా తారల కథలకు తోడు కొత్తగా దివికేగుతున్న వాళ్ళవి కూడా యాడ్ అవుతుండటంతో వీటికి బ్రేక్ పడటం కష్టమే అనేలా ఉంది. ఇటీవలే కాలం చేసిన బిజెపి మహిళా నేత ఫైర్ బ్రాండ్ సుష్మ స్వరాజ్ స్టొరీని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్. ఈ పాత్ర కోసం తాప్సీ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా టాక్స్ ఉన్నాయి.
ఇదే ప్రశ్న మిషన్ మంగళ్ ప్రమోషన్స్ లో అడిగినప్పుడు తాప్సీ బదులు చెబుతూ అంతకన్నా గొప్ప అవకాశం తనకు ఏముంటుందని ఇంత చిన్న వయసులో అంత బరువైన పాత్రను చేయడం కన్నా ఏం కావాలని బదులు చెప్పింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎవరి మనసులో ఉందో ఎవరు తీయబోతున్నారో క్లారిటీ లేదు కానీ మొత్తానికి చర్చ అయితే జోరుగా సాగుతోంది, ఐడియా బాగానే ఉంది కానీ తాప్సీ ఇలాంటి పాత్రకు ఎంతవరకు సూట్ అవుతుందనేది అనుమానమే. ఎంత మంచి పెర్ఫార్మర్ అయినప్పటికీ తాప్సీ లో ప్లస్సులతో పాటు మైనస్సులు లేకపోలేదు.
సుష్మ స్వరాజ్ లాంటి నేత పాత్ర అంటే ఫిజిక్ పరంగా ఎక్స్ ప్రెషన్స్ పరంగా చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ కావాలి. అదంత సులభం కాదు. అందులోనూ భారతీయత అణువణువూ ఉట్టిపడే అమ్మాయి సుష్మ స్వరాజ్ పాత్రకు సూట్ అవుతుంది. ఇది కార్యరూపం దాల్చడం సెట్స్ పైకి వెళ్లడం దీనికంతా బాగా టైం పడుతుంది కానీ ఒకవేళ జరిగితే మాత్రం సెన్సేషనే. సోనియా గాంధీ ప్రధాని అయితే జుట్టు తీసేసి విధవలా బ్రతుకుతానని ఓపన్ గా ఛాలెంజ్ చేసి మాట నెగ్గించుకున్న సుష్మ లాంటి లీడర్ల కథలు స్క్రీన్ పైకి రావడం అవసరమే.