Begin typing your search above and press return to search.
ట్విట్టర్లో అమ్మడికి నరకమే నరకం
By: Tupaki Desk | 9 July 2017 4:36 AM GMTపెద్ద కేరటాలు వచ్చే వరకు చిన్న చిన్న అలలను కూడా వాడుకోండి అన్నాడు ఓ పెద్ద మనిషి. అతని ఉద్దేశ్యం ఏంటంటే చిన్న చిన్న అవకాశాలు కూడా కొన్నిసార్లు మన జీవితాలలో పెద్ద మార్పును తీసుకువస్తాయి కాబట్టి దేన్నీ చిన్నచూపు చూడకూడదని. ఇప్పుడు ఇదెందుకు అనుకుంటున్నారా? అకాల వర్షాం తరమాలో వస్తూ పోతూ ఉన్న హీరోయిన్ తాప్సీ.. ఇప్పుడు తెలుగు సినిమాలపై చేసిన కామెంట్ మనకు తెలిసిందే.
అసలు సౌత్ వాళ్ళు నా టాలెంట్ ను సరిగా వాడుకోలేదు.. పింక్ మరియు నామ్ షబానా సినిమాల్లో చూశాకనే నాకు నటించడం వచ్చని తెలుసుకున్నారు అంటూ కామెంట్ చేసింది. కామెడీ కోసం చెప్పానంటోంది. అయితే విషయం ఏంటంటే.. ఈ కామెంట్లతో ఇప్పుడు తెలుగు ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అందుకే వారు సోషల్ మీడియా సైట్లలో ఆమెను పూర్తి స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగు సినిమాలు మూలంగానే తనకు హింది అవకాశాలు వచ్చాయని గుర్తుపెట్టుకోకుండా ఏదో బాలీవుడ్లో నటిస్తున్నా అనేపాటికి ఆమె స్థాయి పెరిగినట్లు అభిప్రాయపడి ఇలా మట్లాడేసింది అంటూ మనోళ్ళు రచ్చ చేస్తున్నారు.కొంత మంది తెలుగు సినిమా అభిమానులు తాప్సీ అన్న మాటలకు వ్యతిరేకంగా #shameonyoutaapse అనే హ్యాష్ ట్యాగ్ కూడా స్ర్పెడ్ చేయడం మొదలుపెట్టారు. దినతో అమ్మడు తన మీద నెగెటివ్ కామెంట్లు చేస్తున్నవారందరినీ ట్విట్టర్లో బ్లాక్ చేయడం మొదలెట్టింది.
జుడ్వా2 తప్పితే మరే హింది సినిమా చేతిలోలేని తాప్సీ అక్కడ వాళ్ళ దగ్గర గొప్పగా కనిపించడానికి మన తెలుగు సినిమాను చిన్నచూపు చూసుందో లేకపోతే నిజంగానే ఇది ఆమె అభిప్రాయమో తెలియదు. నచ్చకపోతే తెలుగు సినిమాలు చేయకుండా ఉండాలి కాని ఇలా ఏరు దాటినాక తెప్ప తగలబెడతావా తాప్సీ అని తెలుగు అభిమానులు ట్విట్టర్లో నరకం చూపిస్తుంటే.. ఇప్పుడు అమ్మడు అయ్యో అని తల పట్టుకుంది.