Begin typing your search above and press return to search.

తాప్సీ.. ఇంతకీ ఎవరి బ్రేకప్‌ గురించి?

By:  Tupaki Desk   |   3 Feb 2016 3:55 AM GMT
తాప్సీ.. ఇంతకీ ఎవరి బ్రేకప్‌ గురించి?
X
ఇప్పుడు అందరూ దీని గురించే డిస్కస్‌ చేస్తున్నారు. సొట్ట బుగ్గల తాప్సీ అసలు దేని గురించి కామెంట్లు చేస్తుందో ఎవ్వరికీ అర్ధంకావట్లేదు. ఎందుకంటే అమ్మడు ఇన్‌ డైరక్టుగా ఎవరి గురించో ఒక ట్వీటేసింది. అది కూడా ఈక్వేషన్‌.. లా.. అంటూ కాస్త ఘాటుగా చెప్పింది.

''కొత్తగా కనిపెట్టబడిన పబ్లిసిటీ ఈక్వేషన్‌ ఏంటంటే.. సినిమా రిలీజ్‌ దగ్గర్లో ఉన్నప్పుడు బ్రేకప్‌/లింకప్‌ న్యూసులను బీభత్సంగా నెట్‌ లోకి వదలడం'' అంటూ చెప్పుకొచ్చిందీ భామ. అసలే బొంబాయ్‌ లో ఉంటోంది. కొంపతీసి అక్కడేదైనా హోటల్‌ లో రణబీర్‌ కపూర్‌ - కత్రినా కైఫ్‌ లు కలసి పార్టీ చేసుకోవడం ఏదైనా కనిపించిందా?? ఇప్పటికే రణబీర్‌-కత్రినా నిజంగానే బ్రేకప్‌ అయ్యారా లేకపోతే ఫిబ్రవరి 12న ''ఫితూర్‌'' సినిమా రిలీజవుతోంది కాబట్టి.. ఈ స్టోరీలను క్రియేట్‌ చేశారా అనే రూమర్‌ ఉండనే ఉంది. మరి ఇంతకీ తాప్సీ చెప్పింది ఎవరి గురించి?

హృతిక్‌ రోషన్‌ - ఫర్హాన్‌ అక్తర్‌ వంటి వారైతే.. డైరెక్టుగా విడిపోతున్నాం అంటూ మీడియాకు లెటర్లు పంపించేశారు కాబట్టి.. మనం వారికి ఫేక్‌ స్టోరీలు అనుకోలేం. చూస్తుంటే తాప్సీ కామెంట్‌ చేసింది రణబీర్‌ కత్రినల గురించే అనిపిస్తోంది కదూ.