Begin typing your search above and press return to search.

అమ్మడిలో ప్రేమ కోర్కెలు పుట్టేశాయ్

By:  Tupaki Desk   |   27 April 2017 8:08 AM GMT
అమ్మడిలో ప్రేమ కోర్కెలు పుట్టేశాయ్
X
ఉంగరాల జుత్తు తో పాల నురుగు లాంటి మోము తో గలగలమంటూ నవ్వులతూ గుండెల్లో గోదావరిని తాలిపించే అందం ఆమెది. ఝుమ్మంది నాధం తో తెలుగు లో పరిచయం ఐనా ఇప్పుడు హిందిలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను. తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వకపోవడం.. హిందీలో వరుసగా ఛాన్సులు రావడంతో అక్కడే తిష్టేసింది.

ఈ మధ్య వచ్చిన ఘాజి లో కనిపించిన పూర్తి రోల్ కాదు అనే చెప్పాలి. కానీ హింది లో పింక్ బేబీ నామ్ షబానా వంటి నటనకు ఆష్కారం ఉన్న సినిమాలు చేసి ఇక్కడ ఉన్న అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో కొత్త సినిమా కూడా రెడీ అవుతుంది. ఇంతా బిజీ అయి కూడా కొంచెం టైమ్ దొరికితే తన చెల్లి తో మాల్దీవులు బీచ్ లుకు వెళ్ళి సరదాగా గడిపి వచ్చింది. బీచ్ లు అంటే తనకు చాలా ఇష్టం అంటా. అయితే బీచ్ కు వెళ్ళాక అమ్మడిలో ప్రేమ కోర్కెలు పుట్టేశాయి. నాకు మంచి ప్రేమ కథలు చేయాలిని ఉంది అంటోంది. మణిరత్నం సినిమా ప్రేమ అంటే మరీ ఇష్టం అంట. అలాంటి సినిమాలు ఇప్పుడు ఎవ్వరూ తీయట్లేదు.. వాటిలో నటించడానికి మాత్రం నేను రెడీగా ఉన్నా అంటోంది అమ్మడు. మరి ఎవరన్నా అలాంటి సినిమా ఒకటి ఆఫర్ చేయండయ్యా.

ఇప్పుడు డేవిడ్‌ ధావన్‌ కొత్త సినిమా జుడ్వా 2 లో వరుణ్ ధావన్‌ కు జంటగా నటిస్తుంది. డేవిడ్‌ ధావన్‌ కు నన్ను పరిచయం చేసింది పూరీ జగన్నాథ్‌ గారే అని చెప్పుకువచ్చింది పింక్ గర్ల్. తెలుగు లో అందరితో మంచి స్నేహాలు ఉన్నా మరీ ఎందుకో అవకాశాలు రావటంలేదు ఈ ఉంగరాల జుత్తు సుందరికి. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/