Begin typing your search above and press return to search.

ఒక్క తాప్సితోనే కష్టం.. ఇద్దరు తాప్సిలతో నా వల్ల కాదన్నాడట

By:  Tupaki Desk   |   5 Nov 2021 8:35 AM GMT
ఒక్క తాప్సితోనే కష్టం.. ఇద్దరు తాప్సిలతో నా వల్ల కాదన్నాడట
X
తెలుగు ప్రేక్షకులకు తాప్సి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పుడు తాప్సి పాన్ ఇండియా హీరోయిన్‌. తెలుగు లో కెరీర్‌ ను ప్రారంభించి తమిళంలో కూడా సినిమాలు చేసి బాలీవుడ్‌ కు వలస వెళ్లిన ఈ సొట్టబుగ్గల చిన్నది అక్కడ వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తోంది. బాలీవుడ్‌ లో కమర్షియల్‌ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ఆశ పడ్డ తాప్సి కి అనూహ్యంగా ఫీమేల్ లీడ్ పాత్రలు చేసే అవకాశం దక్కింది. వరుసగా ఆ సినిమాలు మాత్రమే చేస్తుండటంతో హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది. ఆ విషయం నిజమే అన్నట్లుగా తాజాగా తాప్సి ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్ ది బాలీవుడ్‌ గా నిలిచింది.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్ లో కొందరు పెద్ద హీరోలు మాత్రమే కాకుండా అప్‌ కమింగ్‌ హీరోలు.. కొత్త హీరోలు కూడా కాస్త గుర్తింపు ఉన్న హీరోయిన్స్ తో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. బాలీవుడ్‌ లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆమె కన్ఫర్మ్‌ చేసింది. ఒకానొక సమయంలో హీరో నాతో నటించేందుకు నో చెప్పాడు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర ద్వి పాత్రాభినయం ఉంటుంది. ఒక్క తాప్సితోనే కష్టం.. ఇద్దరు తాప్సిలు సినిమాలో ఉంటే ఎలా అంటూ నన్ను హీరోయిన్ గా వద్దన్నాడట. ఒక వేళ తాప్సి హీరోయిన్ గా కావాలంటే తాను సినిమాను చేయను అన్నాడట.. అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌ లో హీరోలు పూర్తిగా ఆధిపత్యం సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారని.. అందులో భాగంగా కాస్త డామినేషన్ గా హీరోయిన్ పాత్ర ఉన్నా కూడా ఒప్పుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

మరో హీరో సినిమా చేసేందుకు ఒప్పుకుని.. ఆ తర్వాత నో చెప్పాడు. అసలు విషయం ఏంటీ అంటే సినిమా క్లైమాక్స్ లో హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్ర ఎక్కువ డామినేషన్ గా ఉండటంతో పాటు హీరోయిన్ కు ఎక్కువగా సింపథీ కలిగేలా సన్నివేశాలు ఉన్నాయి. అతడికి తాను అది ఒక లవ్ స్టోరీ.. ఆ కథ నేపథ్యం అలాంటిది కాని ప్రేక్షకులు ఖచ్చితంగా హీరో పాత్రను కూడా స్వీకరిస్తారని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. అతడు ఆ సినిమాను ఒప్పుకోలేదు.. ఆ సినిమా కార్యరూపం దాల్చకుండా అప్పుడు క్యాన్సిల్‌ అయ్యిందని తాప్సి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్ లో ఒక చట్రంలో చిక్కుకుని దాని నుండి బయటకు రాకుండా సేఫ్ గా ఆ జోన్ లోనే సినిమాలు చేస్తూ ఉంటారు. తాప్సి వంటి వారు కొందరు ఇమేజ్ కు విరుద్దంగా సినిమాలు చేయాలనుకున్నా కూడా మేకర్స్ ఆసక్తి చూపడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.