Begin typing your search above and press return to search.
జల్సాల కోసం బైక్ లు ఫోన్ లు మెడలో గొలుసులు కొట్టేస్తున్న నటుడు!
By: Tupaki Desk | 8 April 2021 9:30 AM GMTజూదం ఎంత ప్రమాదకరమో నిరూపించే ఘటన ఇది. ఎంతటి ప్రతిభావంతుడిని అయినా చెడు అలవాట్లు నాశనం చేస్తాయనడానికి ఈ ఎగ్జాంపుల్ చాలు. అతడు ఒక ట్యాలెంటెడ్ నటుడు కం యాంకర్. ఎన్నో సినిమాల్లో గొప్పగా నటించి మెప్పించాడు. బుల్లితెరపైనా వెలుగుతున్నాడు. కెరీర్ పరంగా బోలెడంత భవిష్యత్ ఉంది. కానీ అతడు దానిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.
జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా ధనం ఖర్చు చేశాడు. క్రికెట్ బెట్టింగుల పిచ్చితో ఏకంగా 30లక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడానికి రోడ్డున పడ్డాడు. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీనికోసం బైక్ లు మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్నాడు. దారిని వెళ్లే ఆడాళ్ల మెడలో బంగారు గొలుసులు లాక్కెళుతున్నాడు. చివరికి చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇంతకీ ఎవరా నటుడు? అంటే బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రముఖ టీవీ షో `తారక్ మెహతా కా ఓల్తా చాష్మా`లో చిన్న పాత్ర పోషించిన మీరాజ్ వల్లభాదాస్ కప్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచింగ్ ఫిర్యాదు రావడంతో సూరత్ లో సదరు నటుడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. కప్రికి క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉంది. బెట్టింగ్ జూదంలో 30 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించడానికి తన స్నేహితుడు వైభవ్ జాదవ్ తో కలిసి కప్రి ముంబై వీధుల్లో వస్తువులను దొంగిలించడం.. మెడలో గొలుసులు లాక్కెళ్లడం వంటి ఘాతుకాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ కథలో నటుడు ఎవరన్నది అనవసరం. వ్యసనం ఎంతకు దిగజార్చింది.. నవతరం తప్పుడు దారిన వెళ్లకుండా ఏం చేయాలి? అన్నదే అసలు పాఠం.