Begin typing your search above and press return to search.
దర్శకులకు సవాల్ విసిరిన టబు
By: Tupaki Desk | 12 July 2015 11:41 PM GMTఇటు గ్లామరస్‌గా కనిపించడంలోనైనా... అటు నటనతో దుమ్ము రేపడంలోనైనా టబుకి మరొకరు సాటిలేరనిపిస్తుంది. అందుకే ఆమెను రెండు మూడుసార్లు జాతీయ అవార్డులు వరించాయి. ఫార్టీ ప్లస్‌లోనూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా కనిపించడం టబుకి బాగా తెలుసు. `హెరా ఫెరీ`, `బివినెంబర్ వన్` చిత్రాలతో తన సత్తా ఏమిటో మరోసారి చాటి చెప్పింది టబు. సరైన పాత్రలు అప్పజెబితే మరింతగా అదరగొడతాననీ... కానీ నేటి దర్శకులకు నన్ను వెరైటీ పాత్రల్లో చూపించాలంటే బద్ధకంగా ఉందని వాపోయింది టబు.
ఇటీవల ఎవరు చూసినా నన్ను సీరియస్ పాత్రలతోనే అప్రోచ్ అవుతున్నారనీ... నేనలాంటి పాత్రలకే సరిపోతానని వాళ్లు అనుకొంటుండడం భ్రమ అని ఆవేదన వ్యక్తం చేసింది. దమ్మున్న పాత్రల్ని ఇచ్చి చూడండని ఆమె నేటితరం దర్శకులకు సవాల్ కూడా విసిరింది. హిందీ `దృశ్యం`లో ఆమె కీలక పాత్ర పోషించింది. తెలుగులో నదియా పోషించిన పోలీసు పాత్రని టబు హిందీలో చేసింది. ఆ రోల్‌పై సంతృప్తిగానే ఉన్న టబు, అంతకు మించిన పాత్రలతో నేను మెప్పించగలనని చెప్పుకొచ్చింది. సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసింది టబు. పరిశ్రమలో ఉంటూ వ్యక్తుల అంతరంగాల్ని పరిశీలించే అవకాశం దొరికందని ఆమె తెలిపింది. `నిన్నే పెళ్లాడతా`లో చేసిన పాత్రతోపాటు, `మాచిస్`, `చాందినిబార్`లాంటి సినిమాల కోసం టబు ఎదురు చూస్తోంది. ఇప్పట్లో అలాంటి పాత్రలు సృష్టించి టబుని సంతృప్తి పరిచే దర్శకులు కనిపించడం లేదు మరి!