Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ఎలాంటి బాధ లేదు

By:  Tupaki Desk   |   30 Jun 2018 4:29 AM GMT
ఆ విషయంలో ఎలాంటి బాధ లేదు
X
సీనియర్ హీరోయిన్ టబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు గడిచిపోయింది. కెరీర్ మొదట్లో గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే కనిపించినా ఆ తరవాత నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే కనిపించింది. నటనాపరంగా ల్యాండ్ మార్క్ లుగా మిగిలిపోయే ఎన్నో చెప్పుకోదగిన చిత్రాలు ఆమె కెరీర్ లో ఉన్నాయి.

సాధారణంగా హీరోయిన్లు ఓ స్టేజ్ తరవాత పెళ్లి చేసుకుని చిన్న పాత్రలు చేయడమో.. లేక కెరీర్ కు గుడ్ బై చెప్పి కుటుంబంతో గడపడమో చేస్తారు. కానీ టబు పెళ్లి మాటెత్తకుండా సినిమా షూటింగులతోనే ఇన్ని సంవత్సరాలు గడిపేసింది. ఇన్నేళ్ల కాలంలో పెళ్లి చేసుకోవాలని కానీ... పెళ్లి చేసుకోనందుకు బాధపడిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే లేనే లేవంటోంది టబు. తాను ఆల్వేస్ సింగిల్ అనే అంటోంది. తాజాగా ఓ ఫిలిం ఫెస్టివల్ టాక్ షోలో టబు తన పర్సనల్ విషయాలపై ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో భాగంగా ఈ మాట చెప్పింది. ‘‘సింగిల్ లైఫ్ కరెక్టా.. మ్యారీడ్ లైఫ్ కరెక్టా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి తరవాత లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు’’ అంటూ తన మనసులో మాట చెప్పింది.

టబు చేసిన సినిమాల్లో చీనీ కమ్ కాస్త స్పెషల్. ఇందులో 34 ఏళ్ల ఒంటరి మహిళ పాత్రలో ఆమె కనిపిస్తుంది. చెఫ్ గా పనిచేసే 64 ఏళ్ల అమితాబ్ తో ఆమె ప్రేమలో పడుతుంది. ప్రేమలో పడడం మినహా తన లైఫ్ అండ్ క్యారెక్టర్ మొత్తం ఆ సినిమాలోలాగే ఉంటుందని చెప్పుకొచ్చింది టబు.