Begin typing your search above and press return to search.
48 ఏళ్ల హీరోయిన్ పెళ్లి చేసుకోబోతోందా?
By: Tupaki Desk | 18 Sep 2015 9:30 AM GMTభారతీయ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన హీరోయిన్ లలో టబు ఒకరు. మొదట్లో గ్లామర్ రోల్సే చేసినా.. ఆ తర్వాత వివిధ భాషల్లో అద్భుతమైన పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది టబు. జాతీయ అవార్డు కూడా ఆమె సొంతమైంది. లేటు వయసులో మరిన్ని మంచి పాత్రలతో దూసుకెళ్తోంది టబు. ఈ మధ్యే ఆమె హిందీ ‘దృశ్యం’లో చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ 48 ఏళ్ల హీరోయిన్ ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇంత వయసొచ్చాక ఇంకేం పెళ్లి చేసుకుంటుందిలే.. సింగిల్ గానే జీవితాన్ని కొనసాగించేస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ టబు ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
టబుకి టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరంటే వల్లమాలిన అభిమానం అని.. ఆయన కోసమే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయిందన్నది చాలామంది చెప్పేమాట. ఐతే ఆ హీరో కొడుకులు కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నారిప్పుడు. ఆ హీరోతో ఆమెకు ఈ మధ్య దూరం కూడా బాగా పెరిగిపోయింది. ఇలాగే ఒంటరిగా ఉండిపోతే లేటు వయసులో తనకంటూ ఎవరూ తోడుండరని భావించి.. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని భావిస్తోందట టబు. పిల్లల కోసం కాకున్నా.. తనకంటూ ఓ సెక్యూరిటీ కోసమైనా పెళ్లి చేసుకోక తప్పదన్న ఉద్దేశంతో ప్రస్తుతం వరుడి వేటలో ఉందట టబు. ఎవరైనా వ్యాపారవేత్తతో స్థిరపడాలన్నది ఆమె ఆలోచనట. ఈ వ్యవహారమేదో టబు అభిమానించే హీరోనే చక్కబెడితే బెటరేమో.